Steve Smith Centuries : దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా రెండో రోజు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత అందుకున్నాడు. డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలుకొడుతూ టెస్టు కెరీర్‌లో 30వ శతకాన్ని నమోదు చేశాడు. అన్‌రిచ్ నోర్జె వేసిన బంతిని అద్భుతమైన షాట్ ఆడి 190 బంతుల్లో ఈ మైలు రాయిని అందుకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహరాజ్ చేతిలో 104 పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు.
ఈ సిరీస్‌లో కేశవ్‌కి ఇది తొలి వికెట్. మరోవైపు ఈ మ్యాచ్‌తో 8,647 పరుగులు పూర్తి చేసి మైకేల్ క్లార్క్ రికార్డును సైతం స్మిత్ అధిగమించాడు. ఈ ఘనతతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో అస్ట్రేలియా ఆటగాడిగా.. మొత్తంగా 14వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రికీ పాంటింగ్(41), స్టీవ్ వాగ్(32) మాత్రమే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.