Steve Smith Australia :ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఆటగాడు స్టీవ్‌కు తాజాగా ప్రమోషన్ దక్కింది. ఆసీస్ టెస్ట్ జట్టుకు ఓపెనర్‌గా అతడు ఎంపికయ్యాడు. టెస్టుల నుంచి వార్నర్ రిటైర్ కావడం వల్ల ఆ స్థానాన్ని స్మిత్ భర్తీ చేయనున్నాడు. ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించారు.
వార్నర్ రిటైర్మెంట్ తర్వాత స్మిత్ టెస్ట్ ఓపెనింగ్ స్థానంపై తన ఇష్టాన్ని స్వయంగా వెల్లడించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఆసీస్ సెలెక్టర్లు స్మిత్‌ను జట్టు ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. మరోవైపు విండీస్‌తో సిరీస్‌కు రెగ్యులర్ ఓపెనర్‌గా మ్యాట్ రెన్‌షాను కూడా ఎంపిక చేసిన సెలెక్టర్లు, అతన్ని ఏ స్థానంలో బరిలోకి దించుతారో అన్న విషయంపై సన్పెన్స్ ఉంచారు.
ఇక స్మిత్ కెరీర్ విషయానికి వస్తే లెగ్ స్పిన్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన స్మిత్, ఆసీస్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగే ఈ స్టార్ బ్యాటర్ ఇప్పుడు ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాడు.
మరోవైపు విండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా ఆసీస్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు కూడా రెస్ట్ ఇచ్చారు.