విశాఖ వేదికగా మార్చి 19న ఆసీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు కంగారూల చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసే సమయంలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతిని కెప్టెన్ స్టీవ్ స్మిత్ గాల్లోకి ఎగిరి మరీ క్యాచ్ పట్టాడు. ఇక ఈ క్యాచ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే స్మిత్ క్యాచ్ పట్టగానే కామెంటరీ బాక్స్ నుంచి సంజయ్ మంజ్రేకర్ దీన్ని 'క్యాచ్ ఆఫ్ ది సెంచరీ'గా పేర్కొన్నాడు.
కాగా, ఈ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. అనంతరం ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్‌కు కేవలం మూడు బంతులు మాత్రమే వేసిన స్టార్క్ అతడ్ని పరుగులు తీయకుండా కట్టడి చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో బంతి పాండ్యా బ్యాట్‌కు టచ్ అయి స్లిప్స్‌లో ఉన్న స్మిత్ వైపు వెళ్లింది. అయితే ఆ బాల్ స్మిత్‌కు చాలా దూరం నుంచి వెళ్లేలా కనిపించింది. కానీ అనూహ్యంగా అతడు గాల్లోకి జంప్ చేసి మరీ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో కేవలం మూడు బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు హార్దిక్.