Pant Wicketkeeper: గత కొన్నేళ్లుగా టీమ్ఇండియాకు ఆడుతున్న వికెట్‌కీపర్-బ్యాటర్ పంత్.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పలు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ అతడు.. బ్యాటింగ్, కీపింగ్ విషయంలో ఎంఎస్ ధోనీ లేని లోటును మాత్రం పూర్తిస్థాయిలో తీర్చలేకపోయాడు. కానీ ఆ లోటును తీర్చేందుకు శ్రమిస్తున్నాడు. కాగా, ఇప్పుడతడు దక్షిణాఫ్రికాతో జరగబోయే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. వికెట్‌కీపర్‌గా ఎలా ఎదిగాడో, ఎందుకు ఈ బాధ్యతను ఎంచుకున్నాడో తెలిపాడు.
ఆయనే నా స్ఫూర్తి.. అందుకే వికెట్‌కీపర్ అయ్యా: పంత్ - రిషభ్ పంత్ స్ఫూర్తి
Pant Wicketkeeper: తాను క్రికెట్లో వికెట్‌కీపర్ బాధ్యతను ఎందుకు ఎంచుకున్నాడో తెలిపాడు టీమ్ఇండియా ఆటగాడు పంత్. సక్సెస్ఫుల్ వికెట్‌కీపర్‌గా మారాలంటే ఏం చేయాలో చెప్పాడు.
"వికెట్‌కీపింగ్ చేయడంలో మెరుగు అవుతున్నానా లేదా అనేది నాకు తెలియదు. కానీ ప్రతిరోజు వందశాతం ఉత్తమంగా ఆడటానికే ప్రయత్నిస్తున్నాను. నేనెప్పుడూ వికెట్‌కీపర్-బ్యాటర్‌నే. మా నాన్న వికెట్‌కీపర్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి వికెట్‌కీపింగ్ చేయడంపై దృష్టి పెట్టాను. ఆయనే నా స్ఫూర్తి. అందుకే ఇందులో కొనసాగుతున్నాను. మంచి వికెట్‌కీపర్‌గా ఎదగాలంటే ఎప్పుడూ చురుగ్గా, ఒత్తిడి లేకుండా ఉండాలి. అదే మీకు ఉపయోగపడుతుంది. అప్పుడే వందశాతం ప్రదర్శన చేయగలరు. ఇక రెండో విషయమేమిటంటే బంతిని ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి. టెక్నిక్, క్రమశిక్షణతో ఆడాలి. అప్పుడే విజయవంతమైన వికెట్‌కీపర్ అవ్వగలరు" అని పంత్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: T20 worldcup: భలే ఛాన్స్.. సత్తా చాటేదెవరో?