Benstokes retirement: బెన్‌స్టోక్స్.. క్రికెట్ గురించి తెలిసిన ప్రతిఒక్కరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది. ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మంగళవారం డర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ తనకు చివరిదని తెలిపాడు. ఈ ఫార్మాట్‌లో జట్టుకు ఇకపై అత్యుత్తమ సేవలు అందించలేనని పేర్కొన్నాడు. తనకు ఇన్నేళ్ల పాటు అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇకపై నుంటి టీ20, టెస్టుపై పూర్తిగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై - బెన్‌స్టోక్స్ రిటైర్మెంట్
Benstokes retirement: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
![ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. వన్డే క్రికెట్‌కు గుడ్‌బై Ben Stokes announces retirement from ODI cricket.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15857892-thumbnail-3x2-benstokes.jpg)
బెన్‌స్టోక్స్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు
"మంగళవారం డర్హమ్‌లో నా చివరి మ్యాచ్‌ను ఆడతాను. ఆ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాను. ఈ నిర్ణయం ఎంతో కఠినమైనది. నా తోటి ప్లేయర్స్‌తో ఆడిన ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదించా. ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది." అని అన్నాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ గెలవడంలో బెన్‌స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇటీవల అతడు టీమ్‌ఇండియాతో ఆడిన వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
Last Updated : Jul 18, 2022, 5:31 PM IST