ఇంగ్లాండ్ టూర్కు ముందు భారత మహిళల క్రికెట్కు శుభవార్త చెప్పింది బీసీసీఐ. భారత మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్.. భారత మహిళల క్రికెట్ టీమ్ బ్యాటింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పనిచేసిన అనుభవం తనకు ఈ విధంగా ఉపయోగపడిందని దాస్ తెలిపాడు.
"గత నాలుగైదు ఏళ్లుగా ఎన్సీఏలో భాగంగా ఉన్నాను. గత కొన్నేళ్లుగా బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాను. నాపై నమ్మకముంచి నాకు ఈ అవకాశమిచ్చిన రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీకి ధన్యవాదాలు"
-శివ సుందర్ దాస్, మాజీ భారత క్రికెటర్.