తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెలెక్టర్ల పదవికి 50 మందికిపైగా దరఖాస్తు.. ముందు వరసలో ఎవరున్నారంటే? - వినోద్​ కాంబ్లీ బీసీసీఐ సెలక్టర్ల పోస్ట్​

బీసీసీఐ పురుష సీనియర్‌ జట్టు సెలెక్టర్ల పదవి కోసం దాదాపు 50 మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ముందు వరుసలో ఉన్నవారెవరంటే?

BCCI selection posts
సెలెక్టర్ల పదవికి 50 మందికిపైగా దరఖాస్తు

By

Published : Nov 29, 2022, 2:41 PM IST

బీసీసీఐ పురుష సీనియర్‌ జట్టు సెలెక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకొనే గడువు సోమవారంతో ముగిసింది. ఐదు పోస్టుల కోసం దాదాపు 50 మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ మనిందర్‌ సింగ్‌, మాజీ ఓపెనర్ శివ్‌సుందర్ దాస్‌, వినోద్ కాంబ్లి ఉన్నారు. దరఖాస్తుదారుల్లో సుపరిచితమైన ఆటగాళ్లు వీరే.. ఇక మాజీ పేసర్‌ అజిత్‌ అగర్కార్‌ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అగర్కార్‌ దరఖాస్తు చేశాడో లేదో మాత్రం తెలియరాలేదు.

ముంబయి జోన్‌ నుంచి కాంబ్లితోపాటు సీనియర్‌ ముంబయి జట్టు ప్రస్తుత ఛైర్మన్ సలీల్‌ అంకోలా, మాజీ వికెట్‌ కీపర్‌ సమిర్‌ దరఖాస్తు చేసుకొన్నారు. అయితే 50 మందిలో మనిందర్‌ సింగ్‌ (35 టెస్టులు, 59 వన్డేలు), ఎస్‌ఎస్‌ దాస్‌ (21 టెస్టులు, 4 వన్డేలు) మాత్రమే అందరికంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడటం గమనార్హం. తర్వాత వినోద్ కాంబ్లి (17 టెస్టులు, 104 వన్డేలు) ఉన్నాడు. మనిందర్‌ సింగ్‌ 2021లోనూ దరఖాస్తు చేసుకోగా.. ముఖాముఖిలో అర్హత సాధించలేకపోయాడు. మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) చేతన్‌ శర్మ వైపు మొగ్గు చూపింది. చేతన్‌, మనిందర్‌ ఒకే కాలంలో క్రికెట్‌ ఆడిన ఆటగాళ్లు. ఈసారి సెలెక్టర్‌ పదవి కోసం దరఖాస్తు చేసినట్లు మనిందర్‌ ఖరారు చేశాడు. దక్షిణ జోన్‌ నుంచి హైదరాబాద్‌ మాజీ స్పిన్నర్‌ కున్వాల్‌జీత్‌ సింగ్‌ దరఖాస్తు చేశాడు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇదీ చూడండి:ఆ నటితో పెళ్లి.. కానీ జాన్వీతో కలిసి జిమ్​లో కేఎల్​ రాహుల్ అలా!

ABOUT THE AUTHOR

...view details