Srilanka Nagin Dance : సాధారణంగా ప్రత్యర్థి జట్టుపై విజయం సాధిస్తే నాగిని డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకోవడం బంగ్లాదేశ్ టీమ్‌కు ఆనవాయితి. కీలక వికెట్ పడినా నాగిని డ్యాన్స్ ఉండాల్సిందే. అయితే వాళ్ల రుచి వారికే చూపిస్తే... ఎలా ఉంటుంది. అదే జరిగింది ఇప్పుడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠపోరులో శ్రీలంక విజయం సాధించింది. దింతో ఆ జట్టు ప్లేయర్ చమిక కరుణరత్నెతో పాటు అభిమానులు కూడా నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగుతోంది. అయితే.. తన తొలి మ్యాచ్‌లోనే అఫ్గానిస్థాన్‌పై లంక ఘోర ఓటమిని చవిచూసింది. బంగ్లా కూడా అఫ్గాన్ చేతిలో ఓడింది. ఈ గ్రూప్ నుంచి సూపర్-4 తొలి బెర్తును అఫ్గాన్ ఖరారు చేసుకుంది. దీంతో సూపర్-4 దశకు చేరుకోవాలంటే లంక, బంగ్లాదేశ్ పోరు కీలకంగా మారింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌పై లంక సమష్టిగా రాణించి విజయం సాధించింది. సూపర్-4లోకి అడుగు పెట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 183/7 స్కోరు సాధించింది. ఛేదనలో ఎనిమిది వికెట్లను కోల్పోయిన లంక 19.2 ఓవర్లలో 184 పరుగులు చేసి గెలిచింది. చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు అవసరం కాగా.. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అప్పటికే కీలక ఇన్నింగ్స్ ఆడిన శనక (45), మెండిస్ (60) పెవిలియన్‌కు చేరారు. అయితే చమిక కరుణరత్నె (16: 10 బంతుల్లో) కాస్త దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 19వ ఓవర్‌లో రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ ఓవర్‌లో లంక బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతుల్లోనే ఐదు పరుగులు రాబట్టింది. అయితే తర్వాతి బంతిని బంగ్లా బౌలర్ మహెది హసన్ నోబాల్‌గా వేశాడు. దానికి మరో రెండు పరుగులు వచ్చాయి. 19.2 ఓవర్లలో 184 పరుగులు చేసి లంక విజయం సాధించింది. కాగా, 2018లో నిధహస్ ట్రోఫీలో బంగ్లా చేతిలో శ్రీలంకో ఓడిపోయింది. అప్పుడు బంగ్లా నాగిని డ్యాన్స్ వేస్తూ సంబరాలు చేసుకుంది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు బంగ్లాను ఓడించి శ్రీలంక నాగిని డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంది. ఆ వీడియోలను మీరూ వీక్షించండి..
ఇవీ చదవండి:కోహ్లీ బెస్ట్ బ్యాటర్.. కానీ ఆసీస్‌తో అంత ఈజీ కాదు: రికీ పాంటింగ్
కెప్టెన్ రోహిత్ సర్ప్రైజ్.. సిల్వర్‌స్క్రీన్ ఎంట్రీకి గ్రాండ్‌గా ప్లాన్.. హీరోయిన్గా రష్మి