MS Dhoni World Cup Six : 2011 వన్డే ప్రపంచకప్ఫైనల్లో శ్రీలంకపై ధోనీ కొట్టిన సిక్స్‌ను క్రికెట్ లవర్స్ ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్‌ఇండియాకు మరో వన్డే వరల్డ్ కప్ దక్కిన అద్భుత ఘట్టం అది. ప్రజలు ఎంతో ఉత్కంఠగా టీవీలకు అతుక్కుపోయి మరీ రిజల్ట్ కోసం వేచి చూసిన సమయం. ఆ క్షణం.. ధోనీ సిక్స్ ఓ సంచలనంగా మారి.. జట్టుకు కప్‌ను అందించింది. దీంతో ఈ చిరస్మరణీయ విజయానికి గల క్రెడిట్‌ను 'కెప్టెన్ కూల్' ధోనీ కొట్టేశాడనే వాదన ఎప్పటినుంచో ఉంది. అయితే తాజాగా ఈ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. అంతే కాకుండా 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ ధోనీ ముందుకు రావడానికి గల ప్రధానం కారణాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించాడు.
'ఆ సమయంలో ధోనీ ముందే వస్తాడని ఊహించాం..' - 2011వరల్డ్ కప్ ఇండియన్ టీమ్
ODI World Cup 2011 : శ్రీలంక మాజీ ప్లేయర్ ముత్తయ్య మురళీథరన్.. 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు ఆ సమయంలో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎందుకు ముందుకు వచ్చాడో గల కారణాలను ఆయన వివరించాడు.
"నా బౌలింగ్‌లో యువీ చాలా ఇబ్బంది పడేవాడు. అతను ఓ అత్యుత్తమ క్రికెటర్ అనడంలో సందేహం లేదు. మిడిల్‌ఆర్డర్‌లో అతడు కీలక పాత్ర పోషించాడు. కానీ, నా బౌలింగ్‌లో ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. దీంతో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చాడు. అలా ఎందుకు వచ్చాడో కూడా మాకు తెలుసు. ఐపీఎల్ సందర్భంగా ధోనీకి నెట్స్‌లో ఎక్కువగా బంతులను నేను వేశాను. అతడికి నా బౌలింగ్‌పై మంచి అవగాహన ఉంది. దీంతో నాకు వికెట్ ఇవ్వకూడదనే కృతనిశ్చయంతోనే ఆ రోజు అతను ముందుకు వచ్చాడు. నాకు ఆ మ్యాచ్‌లో వికెట్ దక్కకపోయినా పొదుపుగానే బౌలింగ్ చేశాను. ఇక వాంఖడే స్టేడియంలో తేమ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎక్కువగా బంతిని స్పిన్ చేయలేకపోయాం. ఒక ఎండ్‌లో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఆ సమయంలో వికెట్ పడితే తప్పకుండా రైట్‌హ్యాండ్ బ్యాటర్ అయిన ధోనీ వస్తాడని ముందే అంచనా వేశాం" అని ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు.
ఇక 2011లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో మురళీధరన్ 8 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 39 పరుగులు ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274/6 స్కోరు సాధించగా.. భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 48.2 ఓవర్లలో 277 పరుగులు చేసి ఘన విజయాన్ని సాధించింది.