రెండో వన్డేలో ఓటమి శ్రీలంక కెప్టెన్, కోచ్ మధ్య వివాదానికి దారితీసిందా? మైదానంలో సారథి దసున్ శనక ఫీల్డింగ్ మోహరింపులు, వ్యూహాల అమల్లో లోపాలు మైక్ ఆర్థర్‌కు నచ్చలేదా? అందుకే అతడు ఓటమి తర్వాత అతిగా స్పందించాడా? సారథితో విభేదించి మైదానం నుంచి వెళ్లిపోయాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది!
టీమ్‌ఇండియాతో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక ఓటమి పాలైంది. 276 పరుగుల లక్ష్య ఛేదనలో గబ్బర్‌సేన తడబడింది. 160కే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దీపక్ చాహర్ (69*), భువనేశ్వర్ (19*) కలిసి జట్టుకు విజయం అందించారు. దాదాపుగా గెలిచే మ్యాచ్‌లో లంకేయులు ఓటమి పాలయ్యారు. 3 వికెట్లు తీసి ప్రమాదకరంగా మారిన హసరంగకు బంతి ఇవ్వకపోవడం, ఫీల్డింగ్ మోహరింపుల్లో వైఫల్యం వారిని దెబ్బతీసింది. స్లిప్‌లో ఎక్కువ బౌండరీలు వెళ్లాయి.