Rajapaksa retirement: శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు లంక స్టార్ బ్యాటర్ రిటైర్మెంట్ - భనుక రాజపక్స్ వీడ్కోలు
Rajapaksa retirement: శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స రిటైర్మెంట్ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు దూరమవుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని లంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు.
Bhanuka Rajapaksa
గతేడాది జులైలో వన్డే అరంగేట్రం చేశాడు రాజపక్స. ఈ 30 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కేవలం ఆర్నెళ్లు మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా తన కెరీర్లో 5 వన్డే, 18 టీ20లు ఆడి 409 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్-2021లోనూ లంక తరఫున ఆడాడు రాజపక్స. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడో లంక బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 155 పరుగులు సాధించాడు.