SLC new Rules: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాలనుకునే తమ దేశ క్రికెటర్లపై కాస్త కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చింది శ్రీలంక క్రికెట్ బోర్డు. లంక క్రికెటర్లు ధనుష్క గుణతిలక, భానుక రాజపక్ష ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
శ్రీలంక బోర్డు కొత్త నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ ప్రకటించాలనుకునే ఏ క్రికెటరైనా శ్రీలంక క్రికెట్లో మూడు నెలలపాటు సేవలందించాలని ఓ క్రీడా ఛానల్ పేర్కొంది. అయితే.. ఆ ఆటగాడు వీదేశీ టోర్నీల్లో ఆడేందుకు అవసరమైన నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఏసీ) పొందేందుకు మరో ఆరునెలలు వేచి చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
లంక ప్రీమియర్ లీగ్లో ఆడే అర్హత సాధించేందుకు కూడా శ్రీలంక క్రికెటర్లు ఒక సీజన్లో 80 శాతం దేశవాళీ మ్యాచ్లు ఆడాలనే రూల్ ఉంది.
రిటైర్మెంట్కు సిద్ధం!