భారత్ - శ్రీలంక జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కరుణరత్నె బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టగా.. ఆ బంతిని ఆపేందుకు డీప్ స్క్వేర్, మిడ్ వికెట్ ఫీల్డర్లు వాండర్సే, అషేన్ బండారా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఢీకొట్టుకోవడంతో గాయపడ్డారు. వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చారు. బండారాను స్ట్రెచర్ మీద ఆసుపత్రికి తరలించారు. మోకాలికి సంబంధించి స్కాన్ తీసిన అనంతరమే బండారా పరిస్థితి ఏంటనేది తేలుతుంది. వాండర్సే కూడా కాస్త గాయపడినప్పటికీ.. అతడి పరిస్థితి నిలకడగానే ఉంది.
ఒకరినొకరు ఢీకొట్టుకున్న శ్రీలంక ఆటగాళ్లు.. ఆస్పత్రికి తరలింపు - ఇండియా శ్రీలంక మూడో వన్డేలో భారత్ గెలుపు
శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ప్రమాదం జరిగింది. ఫోర్ను ఆపేందుకు వెళ్లిన ఇద్దరు ప్లేయర్లు ఒకరికొకరు ఢోకొట్టుకున్నారు. గాయాలతో లేవలేని స్థితిలో వైద్యులు ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు ఆటగాళ్లు గాయపడటంతో ఇరు శిబిరాల్లోని క్రికెటర్లతోపాటు ఒక్కసారిగా మైదానంలోని ప్రేక్షక్షులు ఆందోళనకు గురయ్యారు. గాయపడిన శ్రీలంక ఆటగాళ్లకు సహాయం చేసేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ కూడా ముందుకొచ్చింది. కాసేపు ఆటకు అంతరాయం కలిగినప్పటికీ.. వారిని ఆసుపత్రికి తరలించిన అనంతరం మ్యాచ్‌ను అంపైర్లు కొనసాగించారు. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా వన్డేల్లో 46వ సెంచరీని పూర్తి చేశాడు. ఇదే సిరీస్‌లో అతడికిది రెండో శతకం కావడం విశేషం.