ఇంగ్లాండ్ పర్యటనలో బయో బబుల్‌ను అతిక్రమించిన శ్రీలంక ఆటగాళ్లపై చర్యలు చేపట్టింది ఆ దేశ క్రికెట్ బోర్డు. వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకను టోర్నీ నుంచి సస్పెండ్ చేసింది. వారిని తక్షణమే స్వదేశానికి రావాల్సిందిగా బోర్డు ఆదేశించింది.
ఏం జరిగిందంటే..
ఇటీవలే జరిగిన టీ20 టోర్నీలో 3-0తో ఓడిపోయింది లంక జట్టు. కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ పర్యటనలో అయినా బయోబుడగలో ఉండాల్సిందే. కానీ లంక క్రికెటర్లు ఇద్దరు మాత్రం బయట తిరుగుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంగ్లాండ్‌లోని ఓ మార్కెట్లో లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్(Kusal Mendis), వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా(Niroshan Dickwella) తిరుగుతూ కనిపించారు. ఈ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారు మాస్క్ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్‌లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ దేశ బోర్డు విచారణకు ఆదేశించింది. చివరికి వారిని సస్పెండ్ చేసింది.
ఇవీ చూడండి: Team India: టీమ్ఇండియా.. మరో ఛాలెంజ్‌కు సిద్ధం