తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక బోర్డు వివాదం: ఆట​కు ప్లేయర్స్​ రెడీ

జూన్​18-జులై 4వరకు జరగబోయే ఇంగ్లాండ్​ పర్యటన కోసం కాంట్రాక్ట్​పై సంతకం చేయకుండా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు శ్రీలంక ఆటగాళ్లు. ఈ పర్యటన ముగిశాక బోర్డుతో కలిసి జాతీయ కాంట్రాక్ట్​ వివాదంపై చర్చించనున్నారు.

Sri Lanka cricketers
శ్రీలంక బోర్డు

By

Published : Jun 8, 2021, 10:56 AM IST

వివాదాల నడుమ ఎట్టకేలకు ఇంగ్లాండ్​ పర్యటనకు సిద్ధమైంది శ్రీలంక జట్టు. ఈ టూర్​ కాంట్రాక్ట్​పై సంతకాలు చేయకుండానే ఆటగాళ్లు సిరీస్​ ఆడనున్నారు. ​అయితే బోర్డు ఓ హామీనిచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ జరిగింది

ఇటీవల శ్రీలంక బోర్డు ప్రతిపాదించిన జాతీయ కాంట్రాక్టులో మొత్తం 24మంది ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విడగొట్టారు. ఏ-కేటగిరీలో ఆరుగురు క్రికెటర్లను చేర్చారు. వీరికి ఏడాదికి రూ.51 లక్షల నుంచి దాదాపు రూ.73 లక్షలుగా నిర్ణయించారు. అయితే దీనిని తిరస్కరిస్తూ.. ఇతర బోర్డులతో పోల్చితే తమకిచ్చే మొత్తం చాలా తక్కువని కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి క్రికెటర్లు. సమస్యను పరిష్కరించేంత వరకు శ్రీలంక టూర్​ సహా భవిష్యత్​ పర్యటనలకు సంబంధించిన కాంట్రాక్టులపై సంతకాలు చేయమని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలోనే​ స్పందించిన బోర్డు.. ఆటగాళ్ల గత ప్రదర్శన ఆధారంగానే ఈ కాంట్రాక్ట్​ను రూపొందించినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఏ ప్రమాణికలను పరిగణించి వారి ప్రదర్శనకు ఎంత జీతభత్యం ఇవ్వాలన్నది నిర్ణయించారో దానిని ఇంగ్లాండ్ టూర్ నుంచి వచ్చాక బహిర్గతం చేస్తామని హామీనిచ్చింది. వివాదంపై చర్చిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు వాలంటరీ డిక్లరేషన్​ మీద సంతకాలు చేసి ఇంగ్లీష్​ జట్టుతో సిరీస్​ ఆడేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ చూడండి: శ్రీలంక బోర్డు వివాదం: కాంట్రాక్టులపై సంతకాలకు క్రికెటర్లు నో

ABOUT THE AUTHOR

...view details