శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఈయనకు శనివారం గుండెపోటు రావడం వల్ల ఆసుపత్రిలో చేర్చారు. ఆపై ఆదివారం యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేసి స్టెంట్ అమర్చినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కు స్టెంట్ - cricket news
గుండెపోటుకు గురైన దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌కు స్టెంట్ వేసినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కలుస్తారని తెలుస్తోంది.
దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు స్టెంట్
త్వరలోనే మురళీ, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి సన్‌రైజర్స్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. శనివారమే మురళీ తన 49వ పుట్టినరోజు జరుపుకొన్నాడు.