ICC RANKINGS: భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో దూసుకుపోయాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో 8 స్థానాలు ఎగబాకి 18వ స్థానం సంపాదించుకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టాప్ 10లో కూడా చోటు దక్కలేదు. శ్రీలంకతో సిరీస్ విశ్రాంతి తీసుకున్న కోహ్లీ 5 స్థానాలు పడిపోయి 15వ స్థానంలో ఉన్నాడు.
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అయ్యర్ అద్భతమైన ప్రదర్శన చేయడం వల్ల మెరుగైన స్థానానికి చేరుకున్నాడు. భారత్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలిచింది. అయ్యర్ 3 మ్యాచుల్లో 174 స్ట్రైక్ రేట్‌తో 204 పరుగులు సాధించాడు.
శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సాంక 9వ స్థానాన్ని సంపాదించాడు. ఇండియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు. యుఏఈ ఆటగాడు మహ్మద్ వసీమ్ 12వ స్థానంలో నిలిచాడు. ఆ దేశం తరఫున టీ20ల్లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. అంతకుముందు శమీన్ అన్వర్ 2017లో 13 ర్యాంకు సాధించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్‌లో భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అజేయమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక పేసర్ లహిరు కుమార ఇండియాతో సిరీస్‌లో 5 వికెట్లు సాధించి తొలిసారిగా టాప్ 40లోకి ఎంట్రీ ఇచ్చాడు.
టెస్టు ర్యాంకుల్లో రబాడ పైకి..