తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అయ్యో.. నేను అలా అనలేదు'.. 'హైబ్రిడ్ మోడల్‌'పై మాట మార్చిన పీసీబీ కొత్త బాస్

Asia Cup Hybrid Model : ఇటీవలే ఆసియా కప్​లో ప్రతిపాదించిన 'హైబ్రిడ్​ మోడల్​' విధానం నచ్చలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు కొత్త ఛైర్మన్​ జకా ఆష్రాఫ్​ మాట మార్చారు. తాను వేరే ఉద్దేశంతో అలా అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఈ విధానంపై ఆయన ఇంతకుముందు ఏమన్నారంటే..

Asia Cup 2023 Hybrid Model
'హైబ్రిడ్ మోడల్‌' నాకు నచ్చలేదు.. : పీసీబీ కొత్త ఛైర్మన్​

By

Published : Jun 22, 2023, 2:21 PM IST

Updated : Jun 22, 2023, 4:56 PM IST

Asia Cup 2023 Hybrid Model : ఆసియా కప్-2023​ నిర్వహణకు సంబంధించి పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు మాజీ చీఫ్​ నజామ్​ సేథీ ప్రతిపాదించిన 'హైబ్రిడ్​ మోడల్​' తనకు నచ్చలేదంటూ పీసీబీ కొత్త చైర్మన్​ జకా ఆష్రాఫ్​ చేసిన కీలక వ్యఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏసీసీ ఆమోదం తెలిపిన హైబ్రిడ్ మోడల్ వల్ల పాకిస్థాన్‌కు నష్టం జరుగుతుందని.. తనకీ విధానం ఏమాత్రం నచ్చలేదని ఆష్రాఫ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధత మళ్లీ నెలకొన్న నేపథ్యంలో ఈ మోడల్ తిరస్కరణపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను వేరే దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణను ఇచ్చుకున్నారు.

"హైబ్రిడ్​ మోడల్​పై తాజాగా నేను చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయితే ఈ హైబ్రిడ్ మోడల్ వల్ల పాకిస్థాన్​కు వచ్చే లాభం ఏమి లేదు. ఈ టోర్నమెంట్​లో ఎక్కువ శాతం మ్యాచులు శ్రీలంకలో, పాక్​లో కేవలం నాలుగు మ్యాచులే జరపడం నాకు నచ్చలేదు. దీనివల్ల మాకు ఉపయోగం ఏమీ ఉండదు. ఆతిథ్యం ఇవ్వాల్సిన దేశం కాబట్టి.. పాక్​ ఇంకొంత బలంగా చర్చించి, టోర్నీ అంతా పాక్‌లోనే జరిగేలా చర్యలు తీసుకుంటే బాగుండేది."
- పీసీబీ నూతన చైర్మన్​ జకా ఆష్రాఫ్​

Asia Cup 2023 : కొత్తగా పీసీబీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన జకా ఆష్రాఫ్​ వెంటనే ఏసీసీ అంగీకరించిన హైబ్రిడ్ మోడల్‌ను వెనక్కు తీసుకుంటారని.. అవసరమైతే ఈ టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకునేలా చర్యలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని భావించిన ఆష్రాఫ్​ ఈ మేరకు స్పందించారు. 'ఇప్పటికే ఈ ఒప్పందంపై ఓ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాని ప్రకారం నడుచుకోవడం తప్ప నేనేమీ చేసేదేమి లేదు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కానీ దాన్ని తిరస్కరిచాలనే ఉద్దేశం కానీ తనకు అస్సలు లేదంటూ' చెప్పారు. మొత్తంగా ఆసియా కప్‌ను అడ్డుకునే దురుద్దేశం మాత్రం తనకు ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. అయితే.. ఇకపై పీసీబీ పరిధిలో తీసుకునే ప్రతి నిర్ణయంపై ఆచితూచి వ్యవహరిస్తామని.. తీసుకునే ప్రతి నిర్ణయంలో దేశ హితం ఇమిడి ఉంటుందని ఆష్రాఫ్​ తెలిపారు. కాగా, ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్‌ జరగాల్సి ఉంది.

అసలేంటీ హైబ్రిడ్​ మోడల్..
Hybrid Model Of Asia Cup : ప్రతీష్ఠాత్మక ఆసియా కప్​ సిరీస్​ ఆసియా ఖండంలోని ఆరు దేశాలైన భారత్​, పాకిస్థాన్​, శ్రీలంక, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​, నేపాల్​ క్రికెట్​ జట్ల మధ్య జరుగుతాయి. కాగా, వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ ఈసారి దాయాది పాకిస్థాన్​ గడ్డపై జరగాల్సి ఉంది. అయితే తమ జట్టుకు సంబంధించి భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్​ టీమ్​ను పాక్‌కు పంపే ప్రసక్తే లైదని భారత క్రికెట్​ బోర్డు బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే దీనికి ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ మోడల్‌ను పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు మాజీ చైర్మన్ నజాం సేథీ ప్రతిపాదించారు. ఈ ఒప్పందం ప్రకారం ఆసియా కప్​ 2023ను పాకిస్థాన్​, శ్రీలంకలో నిర్వహించేందుకు తాజాగా ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ (ఏసీసీ) కూడా అంగీకారం తెలిపింది. దీని ప్రకారం ఇరు దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ హైబ్రిడ్​ విధానంను మొదట్లో బంగ్లాదేశ్​, శ్రీలంకలు ఒప్పుకోలేదు. ఇక అనేక చర్చల అనంతరం ఆసియా కప్​ను నిర్వహించేందుకు శ్రీలంక సుముఖత చూపింది.

Last Updated : Jun 22, 2023, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details