BCCI Chetan Sharma : భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తిరిగి బీసీసీఐ సెలక్షన్ కమిటీలో చేరాడు. అయితే ఈసారి జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు కాకుండా నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
BCCI Chetan : మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమ్ఇండియా ఆటగాళ్ల గురించి ప్రైవేట్ సంభాషణలో అప్పట్లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 80 శాతం ఫిట్‌గా ఉన్న కొందరు ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్‌లకు ముందు ఇంజెక్షన్లు తీసుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లుగా చూపి మ్యాచ్‌లు ఆడుతున్నారని.. వారు తీసుకుంటున్న ఇంజెక్షన్లను డోపింగ్ పరీక్షల్లో సైతం గుర్తంచలేరని ఆరోపించాడు.
గత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా బుమ్రా జట్టులో స్థానం దక్కించుకునే క్రమంలో తనకు, జట్టు యాజమాన్యానికి అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలిపాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పాడు. మరోవైపు టీమ్ఇండియాలో రెండు వర్గాలు ఉన్నాయని.. వాటికి కోహ్లీ, రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కోహ్లీల మధ్య కూడా అంతర్గత చర్చలకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించాడు.
Chetan Sharma BCCI : ఇవే కాకుండా బీసీసీఐకి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలపై చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు బయటకు రావడంపై బీసీసీఐ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చేతన్ శర్మపై వేటు వేసింది. దీంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చేతన్ శర్మ రాజీనామా చేసినప్పటి నుంచి దాదాపు నాలుగు నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు! ఈ క్రమంలో తాజాగా మరోసారి నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు ఈ బీసీసీఐ మాజీ చీఫ్. కాగా, దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ సెలక్షన్ కోసంచేతన్ శర్మ కమిటీలో భాగమయ్యాడు.
Duleep Trophy 2023 : దులీప్ ట్రోఫీ కోసం చేతన్ శర్మ సారథ్యంలోని నార్త్ జోన్ విభాగం.. తమ జట్టుకు మన్‌దీప్ సింగ్‌ను సారథిగా ఎంపిక చేసింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహాల్ వధెరాలు కూడా నార్త్ జోన్లో ఉన్నారు. కాగా, ఈ టీమ్‌లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్‌గా ఉన్నాడు.