టీమ్ఇండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ట్విట్టర్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో తన బ్యాటింగ్ సామర్థ్యం గురించి చెప్పాడు విజయ్. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు జాక్వస్ కలీస్, షేన్ వాట్సన్‌తో తనను పోల్చుకున్నాడు. దీనిపై అభిమానులు వారి తరహాలో కామెంట్లు పెట్టారు.
"నేను ఆల్‌రౌండర్‌ను, నా బ్యాటింగ్ గురించి నాకు తెలుసు. ఆల్‌రౌండర్ అయినంత మాత్రాన ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని లేదు. నేను జాక్వస్ కలిస్, షేన్ వాట్సన్ వంటి వాడిని. వారు ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడం లేదా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. నేను కూడా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి పరుగులు చేస్తే, తగినన్ని వికెట్లు తీస్తే అది జట్టుకు మంచిదే కదా?" అని విజయ్ శంకర్ ట్వీట్ చేశాడు.