టీమ్ఇండియా తరఫున ఆడిన తొలినాళ్లలో తనకు అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని వెల్లడించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag). కెరీర్ ప్రారంభంలో ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఎంతగానో కష్టాలు పడినట్లు చెప్పాడు. తన తొలి ఇంటర్వ్యూను హిందీలోనే చేయమని రవిశాస్త్రిని అప్పట్లో అభ్యర్థించినట్లు వెల్లడించాడు. కానీ, నజఫ్‌గఢ్ నవాబ్ మాత్రం ఇంగ్లీష్ ఇంటర్వ్యూ నుంచి తప్పించుకోలేకపోయాడని పేర్కొన్నాడు.
అయితే ఆ తర్వాతి కాలంలో సెహ్వాగ్(Virender Sehwag) ఇంగ్లీష్ నేర్చుకొని.. ఆట గురించి మీడియాతో మాట్లాడడమే కాకుండా ఇంగ్లీష్‌లో కామెంటేటర్‌గానూ వ్యవహరించాడు. కానీ, అతడు హిందీ మాట్లాడడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు పలుమార్లు వెల్లడించాడు. సెహ్వాగ్ చేసే ట్వీట్లు అత్యధికంగా హిందీలోనే ఉంటాయి. తనకు ఇంగ్లీష్ రాదనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించేందుకు సెహ్వగ్ ఏ మాత్రం వెనుకాడడు.