అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. రెండు బంతుల్లోనే మ్యాచ్ అయిపోయింది. ఓ జట్టు 10 పరుగులకే అలౌట్ అయ్యింది. అందులో ఆరుగురు డకౌట్ కాగా.. మిగతా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు.
ఐజిల్ ఆఫ్ మ్యాన్ జట్టు స్పెయిన్ పర్యటనకు వచ్చింది. ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లు స్పెయిన్ గెలిచింది. ఇరు జట్ల మధ్య ఆరో మ్యాచ్ ఫిబ్రవరి 26న జరిగింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఐజిల్ ఆఫ్ మ్యాన్ జట్టు.. 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయింది. జార్జ్ బుర్రోస్, ల్యూక్ వార్డ్, జాకబ్ బట్లర్ (2) పరుగుల చొప్పున చేశారు. జోసెఫ్ బుర్రోస్(4) పరుగులు చేశాడు. మిగతా వారంతా డకౌట్ అయ్యారు. ఇక స్పెయిన్ బౌలర్లు మహ్మద్ కర్రాన్, ఆటిఫ్ మహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. లార్న్ బర్న్స్ 2 వికెట్లు తీశాడు.
టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు.. ఆరుగురు డకౌట్.. రెండు బంతుల్లో మ్యాచ్ పూర్తి! - అంతర్జాతీయ టీ20 అత్యంత చెత్త రికార్డు
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. రెండు బంతుల్లో మ్యాచ్ ముగిసింది. ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కాగా.. మిగతా వాళ్లు సింగిల్ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే..
ఐజిల్ ఆఫ్ మ్యాన్ జట్టు నిర్దేశించిన 11 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్ జట్టు.. రెండే రెండు బంతుల్లో మ్యాచ్‌ను ముగించింది. ఐజిల్ ఆఫ్ మ్యాన్ జట్టు తొలి బంతినే నో బాల్‌గా వేసింది. ఆ తర్వాత వేసిన రెండు బంతులను బ్యాటర్ అవైస్ అహ్మద్ రెండు సిక్స్‌లు బాదాడు దీంతో 10 వికెట్లు తేడాతో స్పెయిన్ ఘన విజయం సాధించింది. కాగా, మెన్స్ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌ల్లో 10 పరుగులకే ఆలౌట్ కావడం.. అది కూడా 10 వికెట్ల(118 బంతులు మిగిలి ఉండగానే) తేడాతో, ఛేసింగ్‌లో అత్యధిక రన్‌రేట్(39) లాంటి రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. దీంతో ఈ 6 మ్యాచ్‌ల సిరీస్‌ను స్పెయిన్ 6-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు వికెట్లు పడగొట్టిన ఆటిఫ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.