న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ మంచి మనసు చాటుకున్నాడు. ఓ బాలిక వైద్య ఖర్చుల కోసం తన జెర్సీని వేలం వేయాలని నిర్ణయించాడు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని హోలీ బీటీ అనే ఎనిమిదేళ్ల బాలిక వైద్యానికి ఇవ్వనున్నాడు.
"డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా నేను ధరించిన జెర్సీని వేలానికి పెట్టాలని అనుకున్నాను. దీనిపై డబ్ల్యూటీసీ కివీస్ స్క్వాడ్ మొత్తం సంతకాలు చేశారు. ఇదంతా హోలీ బీటీ అనే చిన్నారి కోసం చేస్తున్న చిన్న పని. ఆమె వైద్య ఖర్చులకు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నాం. దీని ద్వారా బీటీ కుటుంబానికి కొంతవరకు సాయం అందుతుందనుకుంటున్నాను. హోలీ తల్లిదండ్రులు పడే వేదన చూసి ఓ తండ్రిగా నా మనసు కరిగిపోయింది. అందుకే చిన్న సాయం చేయాలనుకున్నాం."