తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సౌథాంప్టన్​ పిచ్ స్పిన్​కే అనుకూలం'

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​​ జరగనున్న సౌథాంప్టన్​ పిచ్​ స్పిన్​ బౌలింగ్​కు అనుకూలంగా ఉంటుందని లెజెండరీ క్రికెటర్లు సునీల్​ గావస్కర్, సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు​. న్యూజిలాండ్​తో జరగనున్న తుదిపోరులో భారత స్పిన్నర్లు అశ్విన్​, జడేజా రాణించే అవకాశముందని వెల్లడించారు.

By

Published : Jun 16, 2021, 6:46 PM IST

Southampton pitch
సౌథాంప్టన్​ పిచ్​పై గవాస్కర్​

సౌథాంప్టన్​ వేదికగా జరగనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో పిచ్​ స్పిన్​కు అనూకూలిస్తుందని దిగ్గజ క్రికెటర్లు సునీల్​ గావస్కర్​, సెహ్వాగ్​ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్​లో వాతావరణం వేడిగా ఉంటే పిచ్​ డ్రై అవుతుందని.. అప్పుడు పిచ్​ భారత స్పిన్నర్లు అశ్విన్​, జడేజాకు కలిసొచ్చే అవకాశం ఉందని తెలిపారు.

"సౌథాంప్టన్​లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్​ల్లో స్పిన్​ బౌలర్లే కీలకంగా మారనున్నారు. వేడి కారణంగా పిచ్ డ్రై అవుతుంది. మ్యాచ్​లో సమయం గడిచేకొద్ది బాల్ స్వింగ్ అయ్యే అవకాశముంది. అశ్విన్​, జడేజాలు తమ స్పిన్​ బౌలింగ్​తో రాణించే అవకాశం లేకపోలేదు. కేవలం బౌలింగ్​ మాత్రమే కాకుండా బ్యాటింగ్​లోనూ వీరిద్దరూ రాణించగలరు".
- సునీల్​ గావస్కర్​, దిగ్గజ క్రికెటర్​

పిచ్​పై బంతి స్వింగ్​ అయ్యే అవకాశముంటే భారత స్పిన్నర్లు అశ్విన్​, జడేజా రాణిస్తారని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్​మన్​ వీరేంద్ర సెహ్వాగ్​ అన్నాడు. "ప్రపంచ క్రికెట్​ ర్యాంకింగ్​లో జట్టు స్థానాన్ని నిలపడంలో బౌలర్లు కీలకపాత్ర పోషిస్తారు. డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో ఆడనున్న టీమ్ఇండియా బౌలింగ్ లైనప్ బాగుంది. ఒకవేళ పిచ్ స్వింగ్ అయ్యే అవకాశాలుంటే జడేజా, అశ్విన్ బౌలింగ్​లో సత్తా చాటడం సహా బ్యాటింగ్​లోనూ వీరిద్దరూ రాణించగలరు" అని సెహ్వాగ్​ అన్నాడు.

ఇదీ చదవండి:టీమ్ఇండియా టెస్టు ప్రయాణం చరిత్రాత్మకం!

ABOUT THE AUTHOR

...view details