తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​- దక్షిణాఫ్రికా సిరీస్​లో మార్పులు- కొత్త షెడ్యూల్​ ఇదే.. - టీమ్​ఇండియా వార్తలు

South Africa vs India: దక్షిణాఫ్రికాలో టీమ్​ఇండియా పర్యటనకు సంబంధించి మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. ఈనెల 17న ప్రారంభం కావాల్సిన టెస్టు సిరీస్​, జనవరి 11 నుంచి జరిగే వన్డే సిరీస్​ తేదీల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది.

South Africa vs Indi
భారత్​-దక్షిణాఫ్రికా సిరీస్​ కొత్త షెడ్యుల్​ ఇదే

By

Published : Dec 6, 2021, 9:03 PM IST

South Africa vs India: కరోనా నేపథ్యంలో.. దక్షిణాఫ్రికాలో భారత్​ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్​ సౌత్​ ఆఫ్రికా (సీఎస్​ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు కొత్త తేదీలను ఖరారు చేసింది. ఈనెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన టెస్టులు 26 నుంచి.. జనవరి 11 నుంచి జరగనున్న వన్డే సిరీస్​ 19వ తేదీ నుంచి జరగనున్నట్లు వెల్లడించింది. బీసీసీఐతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.

తొలుత మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు జరగాల్సి ఉండగా కొవిడ్​ నేపథ్యంలో టీ20 సిరీస్​ వాయిదా పడింది.

కొత్త షెడ్యూల్​..

  • తొలి టెస్టు- డిసెంబరు 26-30 - సెంచూరియన్​
  • రెండో టెస్టు - జనవరి 3-7 - జోహన్నెస్​​బర్గ్​
  • మూడో టెస్టు - జనవరి 11-15 - కేప్​టౌన్​

వన్డే సిరీస్​

  • మొదటి వన్డే - జనవరి 19 - పార్ల్​
  • రెండో వన్డే - జనవరి 21 - పార్ల్​
  • మూడో వన్డే - జనవరి 23 - కేప్​టౌన్

ఇదీ చూడండి :న్యూజిలాండ్​పై సిరీస్ విజయం.. టెస్టుల్లో అగ్రస్థానానికి భారత్

ABOUT THE AUTHOR

...view details