ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఇంగ్లాండ్‌కు షాక్ ఇస్తూ తుది పోరుకు దూసుకెళ్లింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ టోర్న్‌మెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది సౌతాఫ్రికా. ఫలితంగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌తో తలపడనుంది.
ఇకపోతే ఈ సెమీస్ మ్యాచ్‌లో 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి పరాజయం చెందింది. అయితే ఒక దశలో ఇంగ్లాండ్ సూనాయసంగా గెలుపొందుతుందని అభిమానులు ఆశించారు. కానీ కీలక సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు దూకుడు ప్రదర్శించడంతో ఇంగ్లీష్ జట్టుకు ఓటమి తప్పలేదు. స్పీడ్‌స్టర్ అయబొంగా ఖాకా తన సూపర్ బౌలింగ్‌తో.. సౌతాఫ్రికా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను తీసింది. మరో బౌలర్ షబ్నమ్ ఇస్మాయిల్ కూడా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. అయితే బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్ జట్టుకు మంచి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు డానిల్లె వ్యాట్, సోఫియా డంక్లే .. తొలి వికెట్‌కు 53 పరుగులు నమోదు చేశారు. ధాటిగా ఆడిన డంక్లే ఆరు ఫోర్లతో 28 రన్స్ చేసింది. వ్యాట్ కూడా ఆరు బౌండరీలతో 34 పరుగులు చేసింది. అలానే షివర్ 5 ఫోర్లతో 40 రన్స్, కెప్టెన్ హీథర్ నైట్ రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించింది. కానీ వీరిద్దరూ ఔటైన తర్వాతే ఇంగ్లాండ్ అసలు కష్టం మొదలైంది. వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరికి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.