తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో కోహ్లీ-రోహిత్​ తీసుకోకపోవడంపై దాదా రియాక్షన్​.. ఏం చెప్పాడంటే? - కోహ్లీ టీ20 భవిష్యత్​పై గంగూలీ

kohli t20 future : గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి టీ20ల్లో కోహ్లీ, రోహిత్​లను సెలక్టర్లు ఎంపిక చేయట్లేదు. తాజాగా ఈ విషయంపై గంగూలీ మాట్లాడాడు. ఏం అన్నాడంటే..

Ganguly on kohli rohith
టీ20ల్లో కోహ్లీ-రోహిత్​ తీసుకోకపోవడంపై దాదా రియాక్షన్​.. ఏం చెప్పాడంటే?

By

Published : Jul 8, 2023, 2:15 PM IST

Updated : Jul 8, 2023, 5:27 PM IST

kohli t20 future : గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత నుంచి ఇప్పటి వరకు టీమ్‌ఇండియా ఎన్నో సిరీస్​లు ఆడింది. కానీ వీటిలో ఒక్క సిరీస్​లోనూ కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అస్సలు ఆడలేదు. తాజాగా వెస్టిండీస్​తో టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులోనూ వీరికి చోటు దక్కలేదు. అయితే, ఈ ఇద్దరిని ఎందుకు పక్కన పెట్టారనే విషయం గురించి బీసీసీఐ లేదా సెలక్టర్లు కానీ ఎటువంటి కారణాలు వెల్లడించలేదు.

దీంతో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్​ కప్​ కోసం హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో రూపొందిన యంగ్ ప్లేయర్ల జట్టును తీర్చిదిద్దేందుకే బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ తాజాగా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్.. ఈ ఇద్దరిని టీ20 జట్టులోనూ ఉంచాలని సెలెక్టర్లకు సూచించాడు.

"ఎప్పుడూ మంచి జట్టునే ఎంపిక చేయాలి. దీన్ని సెలక్టర్లు చూసుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు.. టీ20ల్లోకి ఎందుకు చోటు కల్పించడం లేదో అస్సలు అర్థం కావడం లేదు. వారిద్దరు ఎందుకు ఆడటం లేదనే విషయం నాకు కూడా తెలియడం లేదు. ఐపీఎల్‌లో విరాట్​ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతను మంచి దూకుడు మీద ఉన్నాడు. అందుకే.. ఈ ఇద్దరినీ టీ20ల్లోకి తీసుకోవాలి. సీనియర్లు ఉంటే టీమ్​లోని యంగ్‌ ప్లేయర్లకు మరింత ప్రయోజనం ఉంటుంది. విండీస్‌తో జరగనున్న సిరీస్‌కు రింకు సింగ్, రుతురాజ్‌ గైక్వాడ్‌, జితేశ్‌ శర్మను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వారికి అవకాశం రాకపోయినప్పటికీ యశస్వి, తిలక్‌ వర్మ లాంటి యువ ప్లేయర్లకు ఛాన్స్‌ దక్కింది. కాబట్టి అవకాశం అనేది తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు నిరంతరయాంగా ఆడుతూనే ఉండాలి. అన్నీ నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నిలకడైన ప్రదర్శన ఇస్తూ ఉంటే జట్టులోకి రావడం ఖాయం. ఎప్పుడైనా సరే జట్టులోకి 15 మందినే తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ 11 మంది మాత్రమే మైదానంలో ఆడతారు. కొంతమందిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అయితే, తప్పకుండా అందరికీ అవకాశాలు వస్తాయనే నమ్మకం నాకు ఉంది" అని గంగూలీ తెలిపాడు.

Last Updated : Jul 8, 2023, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details