Sourav Ganguly Rahul Dravid: టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భారీ అంచనాలున్నాయి! రవిశాస్త్రిని భర్తీ చేసినప్పటి నుంచి అతడి నేతృత్వంలో దక్షిణాఫ్రికా పర్యటన మినహా అన్ని ఫార్మాట్లలో భారత్ మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ క్రమంలోనే ద్రవిడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దాదా.
"ద్రవిడ్.. క్రికెట్ ఆడే రోజుల్లో ఎంత ఫ్రొఫెషనల్‌గా, పోటీతత్వంతో, శ్రద్ధగా ఉండేవాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఒక్కటే తేడా. అతడు ఇప్పుడు ఇండియా తరఫున మూడో స్థానంలో ఆడటం లేదు. అయితే కోచ్‌గా అతడు అసాధారణంగా రాణిస్తాడు. ఎందుకంటే అతడికి అంత నిజాయతీ, ప్రతిభ ఉన్నాయి. అందరిలాగే అతడూ తప్పిదాలు చేసే అవకాశం ఉంది. అయితే సరైన పనుల కోసం ప్రయత్నించే కొద్దీ ఇతరుల కన్నా మెరుగైన విజయాలు సాధిస్తాం."
-సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు