తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ బోర్డు సభ్యుడిగా తప్పుకున్న గంగూలీ! - బీసీసీఐ అధ్యక్షుడు

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News).. మోహన్ బగన్ బోర్డు సభ్యుడిగా తప్పుకున్నారు. ఈ మేరకు బోర్డుకు లేఖ కూడా పంపారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి

ganguly
గంగూలీ

By

Published : Oct 28, 2021, 7:32 PM IST

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News).. ఏటీకే మోహన్ బగన్ ఫ్రాంచైజీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

"ఏటీకే- మోహన్ బగన్ బోర్డ్ ఆఫ్​ డైరెక్టర్స్​ నుంచి తప్పుకుంటున్నట్లు గంగూలీ తెలిపారు. ఈ మేరకు బోర్డుకు లేఖ పంపించారు." అని ఐపీఎల్​ వర్గాలు పేర్కొన్నాయి.

కారణం అదే..

ఐపీఎల్​లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం ఇటీవల జరిగిన వేలంలో(IPL franchise auction) అహ్మదాబాద్‌ను రూ.5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ సొంతం చేసుకోగా.. లఖ్‌నవూను(IPL new teams) రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్జీ వెంచర్స్​ అధినేత సంజీవ్​ గోయంకా దక్కించుకున్నారు. అయితే సంజీవ్​కు ఐపీఎల్​ ఫ్రాంచైజీ దక్కడంలో​ గంగూలీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్​ సూపర్​ లీగ్​లో​(ఐఎస్​ఎల్​) సంజీవ్ గోయంకా ఛైర్మన్​గా ఉన్న ఏటీకే-మోహన్​ బగన్​​ ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​లో గంగూలీ సభ్యుడుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:

IPl New Teams: 'కొత్త జట్లతో దేశవాళీ క్రికెటర్లకు మేలు'

IPL 2021: ఆ జట్టు ఖరీదు రూ.7,000 కోట్లు కాదు.. రూ.2,000 కోట్లే!

ABOUT THE AUTHOR

...view details