ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly biopic) బయోపిక్కు రంగం సిద్ధమైంది. లవ్ ఫిలింస్.. దాదా జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించనుంది. ఈ విషయాన్ని దాదా ట్వీట్ చేశాడు. అయితే సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారో తెలపలేదు.
"క్రికెట్ నా జీవితం. జీవితంలో తల ఎత్తుకొని ముందుకెళ్లడాని ఈ ఆట నాకు సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ ప్రయాణం ఎంతో గొప్పది. లవ్ ఫిలింస్ వారు నా బయోపిక్ నిర్మించేందుకు సిద్ధమవ్వడం సంతోషంగా ఉంది. వారు నా కెరీర్ను వెండితెరపైకి తీసుకురానున్నారు."