తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ గురించి పాజిటివ్​గా మాట్లాడిన గంగూలీ.. ఏమన్నాడంటే?

Sourav Ganguly Comment on Virat Kohli: విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి వైఖరి అంటే తనకు ఇష్టమని అన్నాడు. కానీ ఈ మధ్యే విరాట్​ చిక్కుల్లో పడుతున్నాడని చెప్పాడు.

sourav ganguly comment on virat kohli
గంగూలీ

By

Published : Dec 19, 2021, 5:31 AM IST

Sourav Ganguly Comment on Virat Kohli: కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించిన తర్వాత కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మధ్య వివాదం తార స్థాయికి చేరింది. ఈ మధ్యే గంగూలీకి పూర్తి విరుద్ధంగా కోహ్లీ మాట్లాడాడు. ఆ తర్వాత విరాట్​ గురించి మాట్లాడటానికి స్పందించని గంగూలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ వైఖరి అంటే తనకు ఇష్టమని అన్నాడు. కానీ ఈ మధ్యే తను చిక్కుల్లో పడుతున్నాడని పేర్కొన్నాడు.

గురు​గ్రామ్​లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గంగూలీ.. టీమ్​ఇండియా ఆటగాళ్లలో ఎవరి వైఖరంటే ఇష్టమని అడిగిన ప్రశ్నకు.. 'విరాట్​ కోహ్లీ యాటిట్యూడ్ అంటే ఇష్టం, కానీ ఈ మధ్య తను చిక్కుల్లో పడుతున్నాడు' అని చెప్పాడు. ఒత్తిడిని ఎలా జయిస్తారని అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ.. 'జీవితంలో అసలు ఒత్తిడి అనేదే లేదు.. గర్ల్​ఫ్రెండ్, భార్య, వల్లే ఒత్తిడి వస్తుంది' అని సరదాగా సమాధానమిచ్చాడు.

ఇదీ జరిగింది..

sourav ganguly vs virat kohli: దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టు ఎంపిక చేసినప్పుడు బీసీసీఐ కోహ్లీకి షాకిచ్చింది. విరాట్​ను వన్డే సారథిగా తప్పిస్తూ రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది.

గంగూలీ ఏమన్నాడు..?

Bcci On Virat Kohli Captaincy: కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించిన తర్వాత వివాదం చెలరేగడం వల్ల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని చెప్పినప్పుడు తాము వారించామని అన్నాడు. అయినా, విరాట్‌ తన నిర్ణయానికే కట్టుబడ్డాడని చెప్పాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసే ముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు సారథులు ఉండకూడదని సెలక్షన్‌ కమిటీ భావించిందని దాంతో ఆ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. ఈ విషయాన్ని కోహ్లీకి ముందే వెల్లడించినట్లు గంగూలీ పేర్కొన్నాడు.

గంగూలీ

Virat Kohli Press Conference:

అయితే, గంగూలీ చెప్పిన మాటలకు కోహ్లీ చెప్పిన మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసం ఈ నెల 8న జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు మాత్రమే సెలక్టర్లు తనతో మాట్లాడారని తెలిపాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసినప్పుడు కాల్‌ ముగియడానికి ముందు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారని చెప్పాడు. దీంతో కోహ్లీ, బీసీసీఐ మధ్య విభేదాలు తలెత్తాయని స్పష్టంగా అర్థమవుతోంది.

కోహ్లీ

ఇదీ చదవండి:

Kohli BCCI: వన్డే కెప్టెన్సీ వివాదం.. సునీల్‌ గావస్కర్‌ ఏమన్నాడంటే.?

Virat Kohli BCCI News: తప్పు ఎవరిదైనా.. ముగింపు పలకాలిక..!

'డర్టీ పాలిటిక్స్'.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details