తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాచ్‌ మధ్యలో అనుకోని అతిథి.. ప్లేయర్స్​కు తప్పిన ప్రమాదం.. ఫ్యాన్స్​ హడల్!

టీమ్​ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో వింత సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్​ మధ్యలో అనుకోని అతిథి ఎంట్రీ ఇవ్వడం వల్ల అభిమానులను, క్రికెటర్లు షాక్ అయ్యారు. ఈ సంఘటన వల్ల ఆటగాళ్లకు ప్రమాదం తప్పినట్టైంది.

snake south africa t20 match
మ్యాచ్ మధ్యలో పాము

By

Published : Oct 3, 2022, 6:45 AM IST

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో అనూహ్య ఉదంతం చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ పూర్తయి ఎనిమిదో ఓవర్‌ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ గువాహాటి స్టేడియంలోకి వచ్చేసింది. దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. అభిమానులకు కూడా ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు. దీంతో మైదానంలోకి హుటాహుటిన వెళ్లిన సిబ్బంది పామును పట్టి బయటకు తీసుకెళ్లిపోయారు. మైదానంలోకి కుక్కలు రావడం సాధారణమే కానీ.. ఇలా పాము రావడం అనూహ్యం. దీంతో కాసేపు కెమెరాలన్ని దాని చుట్టూనే తిరిగాయి. ఇదొక్కటే కాదు మ్యాచ్‌లో నిర్వాహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికా ఛేదనలో దీపక్‌ చాహర్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతి వేసిన తర్వాత స్టేడియంలోని నాలుగు ఫ్లడ్‌ లైట్లలో ఒక ఫ్లడ్‌లైట్‌ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆటకు 18 నిమిషాలు అంతరాయం కలిగింది.

కాగా, ఈ మ్యాచ్​లో భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్​లో విధ్వంసకర ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా... మూడు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మొదటి నుంచే సఫారీలకు ఊపిరి సలపనివ్వలేదు భారత బ్యాటర్లు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దక్షిణాఫ్రికా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. నాలుగో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. 277.27 స్ట్రైక్​ రేట్​తో 22 బంతుల్లో 61 పరుగులు చేశాడు. వన్​డౌన్​లో వచ్చిన విరాట్​ కోహ్లీ సైతం.. పరుగులు వరద పారించాడు. విరాట్, సూర్య భాగస్వామ్యంలో స్కోర్​ బోర్డు పరుగులు పెట్టింది. కోహ్లీ 28 బంతుల్లో 49 పరుగులు పూర్తి చేసుకొని నాటౌట్​గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన దినేష్​ కార్తిక్​ సూపర్​ షాట్లతో 7 బంతుల్లో 17 పరుగులు చేసి ఇన్నింగ్స్​ ముగించాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు భారీ టార్గెట్​ సఫారీలకు ఫిక్స్​ చేసింది టీమ్​ ఇండియా.

ఇక 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. రెండో ఓవర్ పూర్తయ్యే సరికి 2 వికెట్లు కోల్పోయి ఒత్తిలో పడింది దక్షిణాఫ్రికా. ఓపెనర్​ టెంబా బవుమా, ఆ తర్వాత వచ్చిన రిలీ రోస్సో ఇద్దరూ డక్​ ఔట్​ అయ్యారు. అనంతరం వచ్చిన ఎయిడెన్​ మార్​క్రమ్.. 19 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. దీంతో క్వింటన్​ డికాక్​, డెవిడ్​ మిల్లర్​ అద్భుతంగా పుజుకున్నారు. సఫారీ స్కోర్​ కార్డును అనూహ్యంగా పరుగులు పెట్టించారు. వారి ధాటికి భారత బౌలర్లు కొద్ది సేపు ఒత్తిడికి గురయ్యారు.


ఇదీ చూడండి:రెండో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే..

ABOUT THE AUTHOR

...view details