Smriti Mandhana Husband Qualities : టీమ్ఇండియా మహిళల జట్టు ప్లేయర్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట తీరుతో ప్రేక్షుకలను అబ్బురపరిచే ఈ స్టార్ క్రికెటర్, తన అందంతోనూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవలే ఇంగ్లాండ్,ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించింది. ఇలా తనకంటూ క్రికెట్ హిస్టరీలో ఓ స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది.
అయితే తాజాగా ఈ యంగ్ ప్లేయర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రోగ్రామ్‌కు వెళ్లింది. ఇందులో ఆమెతో పాటు టీమ్ఇండియా పురుషుల జట్టు ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ హోస్ట్ అడిగిన ప్రశ్నలతో పాటు ఆడియెన్స్ అడిగిన వాటిని ఆన్సర్స్ ఇస్తూ సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని స్మృతిని షాకింగ్ ప్రశ్న అడిగారు.
'మీకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటారు' అంటూ ఆ ఫ్యాన్స్ అడిగారు. దానికి స్మృతికి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు సిగ్గుపడింది. ఆ తర్వాత బదులిచ్చింది. " ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని నేను అసలు ఊహించలేదు. అయితే నాకు మాత్రం అతడు మంచి అబ్బాయి అయి ఉండాలి. అంతే కాకుండా నా కెరీర్‌ను అర్థం చేసుకోవాలి. అలాగే కేరింగ్‌గా కూడా ఉండాలి. ఈ రెండు క్వాలిటీస్ అతడిలో కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నా కెరీర్ కారణంగా ఓ అమ్మాయిగా నేను అతడికి నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. అందుకే అతడు నా పరిస్థితిని, ఆటను అర్థం చేసుకునే వాడు అయ్యుండాలి. నాకు కాబోయే భర్తలో ఈ లక్షణాలను ముఖ్యంగా చూస్తాను'' అని స్మృతి మంధాన ఆన్సర్ చెప్పింది.