SLC lifts Suspension: శ్రీలంక క్రికెటర్లు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, నీరోషన్ డిక్వెల్లాపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. శుక్రవారం నుంచి వారు అన్ని ఫార్మాట్లలో ఆటను కొనసాగించొచ్చని పేర్కొంది. లంక ప్రీమియర్ లీగ్ ముగిసిన నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
"సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డాక్టర్ను కూడా నియమించాం. అనంతరం డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా వారిపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించున్నాం." అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ఏం జరిగిందంటే..
గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా.. ఆ దేశ జట్టుతో జరిగిన టీ20 టోర్నీలో 3-0తో ఓడిపోయింది లంక జట్టు. అయితే.. కరోనా కారణంగా ఆటగాళ్లు ఏ పర్యటనలో అయినా బయోబుడగలో ఉండాల్సిందే అనే నియమం ఉంది. కానీ, లంక క్రికెటర్లు ముగ్గురు మాత్రం బయట తిరుగుతూ కనిపించడం చర్చనీయాంశమైంది.