న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో(IND vs NZ T20 Series) భాగంగా బుధవారం(నవంబర్ 17) తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. బౌలర్ సిరాజ్‌ను కొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
కివీస్‌తో తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో భారత బ్యాటర్లు రాణించినప్పటికీ చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. అయితే.. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ పెవిలియన్ చేరాక డగౌట్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీవీ వైపు తీక్షణంగా చూస్తున్నారు. తమ పక్కనే కూర్చున్న సిరాజ్ మాత్రం పరధ్యానంలో ఉన్నాడు.
అదే సమయంలో డగౌట్లో ఉన్న సిరాజ్ వైపు కెమెరా మళ్లింది. సిరాజ్‌ను టీవీలో చూసిన రాహుల్.. తనకు ఏమైందన్నట్లు సీరియస్‌గా ఓ లుక్కిచ్చాడు. వెంటనే రోహిత్ శర్మ.. సిరాజ్ వెనకుంచి తలపై ఒక్కటిచ్చాడు. దీంతో సిరాజ్ పరధ్యానం నుంచి బయటకొచ్చి ఓ స్మైల్ పడేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. గతంలో హర్భజన్-శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.
తొలి మ్యాచ్ భారత్‌దే..