తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో సిరిసిల్ల కుర్రాడు- గల్లీ క్రికెట్‌ నుంచి ఐపీఎల్‌

Sircilla Cricketer in CSK Team 2024 : భారత క్రికెట్‌ జట్టులోకి చోటు దక్కాలంటే అండర్‌-19 జట్టులో మంచి ప్రతిభ చూపాలి. దీనిలో సత్తా చాటితే ఐపీఎల్‌ అవకాశాలు రావడమే కాదు, ప్రధాన జట్టులో స్థానం పొందవచ్చు. అగ్రశ్రేణి క్రికెటర్లుగా చెలామణి అవుతున్న విరాట్‌కోహ్లి, రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌గిల్‌ వంటి వారు కెరీర్‌ ప్రారంభంలో అండర్‌-19లో పరుగుల వరద పారించినవారే. వారి బాటలోనే సాగి, ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ టోర్నీకి తెలంగాణ నుంచి అవనీశ్‌రావు అనే కుర్రాడు ఎంపికయ్యాడు. అన్నీ అనుకూలిస్తే భారత జట్టులో సిరాజ్‌ తర్వాత మరో హైదరాబాదీని చూడొచ్చు మనం. మరి ఈ సిరిసిల్ల కుర్రాడి ప్రయాణం గల్లీ క్రికెట్ నుంచి ఐపీఎల్​ వరకు ఎలా సాగిందో ఓసారి చూద్దామా?

Sircilla Cricketer CSK Team
Sircilla Cricketer

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 1:31 PM IST

Sircilla Cricketer in CSK Team 2024 :ఇటీవల అండర్‌ -19 వన్డే ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైన తెలంగాణ తెలుగు కుర్రాడు అరవెల్లి అవనీశ్‌రావును ఐపీఎల్‌ వేలంలో అదృష్టం వరించింది. తాజాగాఐపీఎల్‌ 2024 కోసం నిర్వహించిన వేలంలోనూ రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌తో అతడు బరిలోకి దిగాడు. అదే మొత్తం వద్ద చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings) అతడిని సొంతం చేసుకుంది.

Chennai Super Kings Buys Sircilla Cricketer :అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో రాణిస్తే, సీఎస్‌కే(CSK)కి తుది జట్టులో ఆడే అవకాశం రావచ్చు. 2024 జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా అండర్‌-19 ప్రపంచ కప్‌ జరగనుంది. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా ఉన్న 18 ఏళ్ల కుర్రాడు అవనీశ్‌రావు కుటుంబ నేపథ్యం రాజన్న సిరిసిల్ల జిల్లాతో ముడిపడి ఉంది. నాన్న లక్ష్మణరావు స్వగ్రామం ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ కాగా, అమ్మ సుష్మ వాళ్లది కోనరావుపేట మండలం కొలనూరు గ్రామం.

సిరిసిల్ల కుర్రాడు అరవెల్లి అవనీశ్‌రావు

ప్రొఫెషనల్‌ ఆటగాడిగా అడుగులు :ఈ యువకుడుహెచ్‌ఎంవీలో తొలి కోచ్‌ చందు నేతృత్వంలో క్రికెట్​లో ఓనమాలు దిద్దాడు. అప్పటి నుంచే హెచ్​సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​) నుంచి హైదరాబాద్‌ జట్టు తరఫున అండర్‌-14లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడేవాడు. చెన్నై, కేరళ, గోవా, కర్ణాటక, పాండిచ్చేరి జట్లతో ఆడి దక్షిణాదిలో టాపర్‌గా నిలిచాడు. తర్వాత బీసీసీఐ(BCCI) నిర్వహించిన విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో అండర్‌-16లో హైదరాబాద్‌ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పుడు చెన్నై జట్టుపై 183 పరుగులు సాధించి, హైదరాబాద్‌ జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చాడు ఆ యువకుడు.

చెన్నై కెప్టెన్సీని రిజెక్ట్​ చేసిన సంజూ ? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్​

CSK Bought Sircilla Cricketer Avanish Rao in IPL 2024 Auction :అండర్‌-19లో హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అవనీశ్‌రావు బ్యాట్స్‌మెన్‌లలో దేశంలో 13వ స్థానంలో ఉన్నాడు. అలాగే వినూ మన్కడ్‌ ట్రోఫీకి హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇండియా-ఏ టీం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అవనీశ్​రావు. విజయవాడలో గతంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అవనీశ్‌రావు 163 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ను ఓడించి మ్యాచ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇండియా ఫీల్డ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ ప్రస్తుతం ఇతనికి కోచ్‌గా ఉన్నారు.

అవనీశ్​కి ఆసక్తి కలిగింది ఇలా..: అవనీశ్‌రావు కుటుంబం స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మణరావు, సుష్మ. లక్ష్మణరావు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో కుమారుడు అవనీశ్‌రావు చిన్న తనంలోనే అమెరికా వెళ్లిపోయాడు. కాగా తిరిగి ఆరేళ్ల వయసులో హైదరాబాద్‌కు వచ్చాడు. అక్క అన్విత అమెరికాలోనే ఉద్యోగం చేస్తోంది. అవనీశ్‌ ఇంటి చుట్టు పక్కల స్నేహితులతో కలిసి ఎప్పడు ఖాళీ దొరికినా ఎక్కువగాక్రికెట్‌ఆడుతూ ఉండేవాడు. తన ఆసక్తిని గమనించిన తండ్రి తొమ్మిదేళ్ల వయసులో హైదరాబాద్‌లోని హిందూ మహా విద్యాలయ(HMV) క్రికెట్‌ క్యాంప్‌లో చేర్చారు. అవనీశ్‌ ఎడమచేతి వాటం బ్యాట్స్​మెన్.

'ప్రస్తుతం అగ్రశ్రేణి క్రికెటర్లుగా చెలామణి అవుతున్న విరాట్‌కోహ్లి, రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌గిల్‌ వంటి వారు కెరీర్‌ ప్రారంభంలో అండర్‌-19లో పరుగుల వరద పారించినవారే. అక్కడ రాణించి.. ధోనీ దృష్టిలో పడితే సీఎస్‌కేలో జట్టులోనూ ఆడే అవకాశం వస్తుంది. అప్పుడు టీమ్‌ఇండియాలోకి అడుగు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయి. అన్నీ అనుకూలిస్తే భారత జట్టులో సిరాజ్‌ తర్వాత మరో హైదరాబాదీని అవనీశ్ రూపంలో చూడొచ్చు.' -అవనీశ్​రావు కుటుంబ సభ్యులు

అంచనాలను మించిన మినీ వేలం - ఓవర్సీస్​ హౌస్​ఫుల్​- టాప్ ప్లేయర్లు వీరే

MI పై రోహిత్ ఎఫెక్ట్!- గంటలో 4లక్షల మంది అన్​ఫాలో- సూర్య హార్ట్​ బ్రేక్ స్టోరీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details