Harshal patel Riyan parag fight: ఐపీఎల్ 2022లో హర్షల్ పటేల్(ఆర్సీబీ)- రియాన్ పరాగ్(రాజస్థాన్) మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయమై మాట్లాడాడు పరాగ్. ఈ వాగ్వాదం జరగడానికి సిరాజ్ తనను ప్రేరేపించాడని అన్నాడు.
సిరాజ్ వల్లే అతనితో గొడవ జరిగింది: రియాన్ పరాగ్ - సిరాజ్ రియాన్ పరాగ్ గొడవ
Harshal patel Riyan parag fight: ఈ ఐపీఎల్లో ఆర్సీబీ ఆటగాడు హర్షల్ పటేల్‌తో జరిగిన గొడవ గురించి వివరించాడు రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్. ఈ గొడవ జరగడానికి సిరాజ్ ఓ కారణమని చెప్పాడు
![సిరాజ్ వల్లే అతనితో గొడవ జరిగింది: రియాన్ పరాగ్ siraj parag fight](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15484877-thumbnail-3x2-siraj.jpg)
"గతేడాది ఐపీఎల్లో హర్షల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాను. అప్పుడు నన్ను అక్కడి నుంచి వెళ్లిపో అన్నట్లుగా హర్షల్ సైగా చేశాడు. అది నేను మైదానంలో చూడలేదు. ఆ తర్వాత డగౌట్లో చూపించిన రిప్లేలో చూశాను. అప్పటినుంచి అది నా మనసులో ఉండిపోయింది. ఈ సీజ్న్లో అతడి బౌలింగ్‌లో నేను బాగా ఆడాను. అందుకే నేను కూడా అలానే సైగ చేశా. ఎవరినీ తిట్టలేదు. అయితే అక్కడే ఉన్న సిరాజ్ నన్ను పిలిచి 'నువ్వు పిల్లాడివి.. పిల్లాడిలా ప్రవర్తించు' అని అన్నాడు. 'నేను మిమ్మల్ని ఏమి అనలేదు భయ్యా' అన్నాను. అంతలోనే ఇద్దరు కలిసి నా మీదక వచ్చారు. అది కాస్త గొడవకు దారి తీసింది. ఆ తర్వాత మా వాళ్లు నన్ను పక్కకి తీసుకెళ్లారు. మ్యాచ్ ముగిశాక జరిగిందంతా మర్చిపోయి హర్షల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చినా అతను తీసుకోలేదు. అతనికి పరిపక్వత లేదనిపించింది" అని పరాగ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: ఆనంద్ జోరు.. ఐదో రౌండ్లో ప్రపంచ నెం.1పై గెలుపు