తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 worldcup: సికిందర్​ రాజా స్పిన్ మ్యాజిక్​ వెనక ఉన్నది ఇతడేనా? - మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచిన సికిందర్‌ రజా

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు గెలిచిన సికిందర్‌ రజాపై ఫ్యాన్స్​ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్​లో అతడు తన స్పిన్​ మాయాజాలంతో మ్యాచ్​ను మలుపుతిప్పాడు. అయితే ఇలా ఆడగలటానికి గల రహస్యాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే..

సికిందర్​ రాజా మాజి కెప్టెన్​ రికీపై ఆసక్తికర వ్యాఖ్య
sikindar raja intresting comment on ricky

By

Published : Oct 28, 2022, 10:35 PM IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌ను ఓడించిన జింబాబ్వే సంబరాలు చేసుకుంటోంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచిన సికిందర్‌ రజాపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వైవిధ్యమైన స్పిన్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన ఈ ఆటగాడు తాను మరింత ఆత్మవిశ్వాసంతో ఆడటానికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కారణమంటూ తెలిపాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"మ్యాచ్‌ రోజున కాస్త కంగారు.. ఆతృత.. ఉత్కంఠ.. ఇలా అన్నీ కలగలిసిన భావోద్వేగాలకు లోనయ్యాను. ఆ రోజు ఉదయం ఐసీసీ నుంచి నాకో వీడియో క్లిప్‌ అందింది. అందులో రికీ పాంటింగ్‌ నా గురించి మాట్లాడుతున్నాడు. "రికీ లాంటి ఓ క్రికెట్‌ దిగ్గజం మా జట్టును, అందులోనూ నన్ను ప్రశంసిస్తుంటే ఆ క్షణంలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నిజంగా ఆ మాటలు నాపై అద్భుతం చేశాయి. నాకు మరింత ప్రేరణ కలిగించి విజయం దిశగా నడిపాయి. ఆయన మాటలు నాకు ఆత్మ విశ్వాసాన్ని నింపింది. అతడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అంటూ రజా పేర్కొన్నాడు. ఐసీసీ పంచుకున్న ఈ వీడియోలో రికీ మాట్లాడుతూ.. "సికిందర్‌ రజా గురించి నేను ముందుగానే చెప్పాను. అతడెంతో పరిణతి చెందిన ఆటగాడు. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు" అంటూ కొనియాడాడు. మరోవైపు ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా పీసీబీ అధ్యక్షుడు రమీజ్‌ రజా, సెలక్షన్‌ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ వసీంలపై ఆ దేశ మాజీ పేసర్‌ మహమ్మద్‌ ఆమిర్‌ నిప్పులు చెరిగాడు. జట్టు ఎంపిక విషయంలో మొదటి నుంచి ఎంతో నిర్లక్ష్యం వహించారని, ఇప్పుడు ఈ వరుస ఓటములకు ఎవరిని బాధ్యులను చేస్తారంటూ ట్విటర్‌ వేదికగా మండిపడ్డాడు. "పాకిస్థాన్ జట్టు ఎంపిక చాలా బలహీనంగా ఉందంటూ నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? పీసీబీకి తానే దైవంగా భావించుకుంటున్న సదరు అధ్యక్షుడిని, చీఫ్ సెలక్టర్‌ను పదవి నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది" అంటూ ట్వీట్‌ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details