తెలంగాణ

telangana

ETV Bharat / sports

సికిందర్‌ రజా వరల్డ్ రికార్డ్​ - మహామహులకు సాధ్యం కానిది

Sikandar Raza Five Half centuries : జింబాబ్వే కెప్టెన్‌ సికిందర్‌ రజా ప్రపంచ క్రికెట్‌లో మహామహులకు సాధ్యం కాని రికార్డును సాధించాడు. ఆ వివరాలు.

సికిందర్‌ రజా వరల్డ్ రికార్డ్​ - మహామహులకు సాధ్యం కానిది
సికిందర్‌ రజా వరల్డ్ రికార్డ్​ - మహామహులకు సాధ్యం కానిది

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 9:13 PM IST

Updated : Jan 15, 2024, 9:22 PM IST

Sikandar Raza Five Half centuries : జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఇంటర్నేషనల్ క్రికెట్​లో తన ఫామ్ కొసాగిస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో ఈ ఆల్ రౌండర్ చెలరేగి ఆడుతున్నాడు. బ్యాటింగ్​లో మెరుపు ఇన్నింగ్స్​తో బౌలింగ్​లో మ్యాజిక్​ చేస్తూ అదరగొడుతున్నాడు. జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

అయితే తాజాగా అతడు ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజాలకు సాధ్యం కాని ఓ రికార్డును సాధించాడు. ఇంటర్నేషనల్​ టీ20ల్లో వరుసగా ఐదు హాఫ్​ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా వరల్డ్​ రికార్డ్​ క్రియేట్​ చేశాడు. కొలంబోలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ( 42 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాది ఈ అరుదైన మార్క్​ను టాచ్ చేశాడు. సికిందర్ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 58, 65, 82, 65, 62 స్కోర్లు సాధించాడు.

2024 టీ20 వరల్డ్​ కప్ కోసం గతేడాది నవంబర్‌లో ఐసీసీ ఆఫ్రికా రీజియన్‌ క్వాలిఫయర్‌ను నిర్వహించింది. ఇందులో సికిందర్‌ రజా - రువాండా (58), నైజీరియా (65), కెన్యా (82)పై హాఫ్ సెంచరీలు బాదాడు. అనంతరం స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా లంకపై హాఫ్ సెంచరీ బాది స్టార్​ బ్యాటర్లు, హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును సాధించాడు. ఈ లంకపై మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​లో 42 బంతుల్లో 64 పరుగులు చేసిన ఈ స్టార్ ఆల్​రౌండర్​ ఆ తర్వాత బంతితోనూ చెలరేగి 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

కాగా, అంతకుముందు బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్), క్రెయిగ్ విలియమ్స్‌ (నమీబియా), క్రిస్‌ గేల్ (వెస్టిండీస్), గుస్తావ్ మెకియోన్ (ఫ్రాన్స్‌), రేయాన్ పఠాన్ (బెర్ముడా), రిజా హెండ్రిక్స్‌ (దక్షిణాఫ్రికా) టీ20ల్లో వరుసగా నాలుగు హాఫ్​ సెంచరీలు బాదారు. తాజాగా వీరి రికార్డును సికిందర్‌ రజా బ్రేక్ చేశాడు. ఇకపోతే సికిందర్​ బౌలింగ్​లోనూ చివరి ఐదు మ్యాచుల్లో 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

క‌ర్ణాట‌క బ్యాట‌ర్ సంచ‌ల‌నం - ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు

అప్పుడు రష్మిక, ఇప్పుడు సచిన్- డీప్​ఫేక్​తో బెట్టింగ్ మోసం!

Last Updated : Jan 15, 2024, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details