భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌గిల్‌ను 'భవిష్యత్తు' సూపర్ స్టార్‌గా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ 360 పరుగులు సాధించాడు. అతని వీరోచిత ఆటప్రదర్శనని అతను ప్రశంసించాడు. పరుగుల దాహంతో ఉన్న భారత బ్యాటర్ కేవలం ఒక్క భారీ స్కోర్‌తో సంతృప్తి చెందలేదన్నాడు.
'శుభ్‌మన్ గిల్.. భవిష్యత్‌లో క్రికెట్‌ను శాసిస్తాడు' - భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌గిల్ లేటెస్ట్ న్యూస్
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. అయితే అతడిని 'భవిష్యత్తు' సూపర్ స్టార్‌గా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభివర్ణించాడు.
"శుభ్‌మన్‌గిల్ భవిష్యత్తు సూపర్ స్టార్. కివీస్‌తో మొదటి వన్డేలో ద్విశతకం బాది మూడో వన్డేలోనూ సెంచరీ సాధించాడు. కేవలం ఒక్క భారీ స్కోర్‌తో అతడు సంతృప్తి చెందలేదు. అతడు పరుగుల దాహంతో ఉన్నాడని చెప్పటానికి ఈ సిరీస్ నిదర్శనం. అతడి వయసు 23 ఏళ్లే. ఇంత చిన్న వయసులో అతడు చూపించిన బ్యాటింగ్ అద్బుతం. గిల్ మంచి ప్రతిభ గల ఆటగాడు కానీ 30, 40 పరుగులు చేసి వెనుదిరుగుతున్నాడు అని ఇదివరకు భావించే వాళ్లం. కానీ ఇప్పుడు అతడు మా అభిప్రాయాన్ని మార్చేశాడు. నిలకడగా రాణిస్తూ భారీ స్కోర్ సాధిస్తూ భారత టాప్ ఆర్డర్‌కు అండగా నిలుస్తున్నాడు" అని భట్ తెలిపాడు.
కివీస్‌తో మొదటి వన్డేలో డబుల్ సెంచరీ(208) రెండో వన్డేలో 40 పరుగులు మూడో వన్డేలో శతకం(112) సాధించాడు. దాంతో ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా పాక్ ఆటగాడు బాబర్ అజామ్ రికార్డును సమం చేశాడు.