తెలంగాణ

telangana

ETV Bharat / sports

గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​గా గిల్​!.. హార్దిక్ పోస్ట్​కు స్పాట్​ పెట్టాడుగా!

త్వరలోనే హార్దిక్ పాండ్యకు గుజరాత్ షాకివ్వబోతుందా? కెప్టెన్​గా శుభ్‌మన్ గిల్​ను నియమించనుందా?.. ప్రస్తుతం సోషల్​మీడియాలో ఈ చర్చ సాగుతోంది. ఆ వివరాలు..

By

Published : Mar 24, 2023, 3:55 PM IST

Gujarat titans Shubmann gill hardik pandya
గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​గా గిల్​!.. హార్దిక్ పోస్ట్​కు స్పాట్​ పెట్టాడుగా!

టీమ్​ఇండియా వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య.. ఐపీఎల్‌ల్​లో గుజరాత్‌ టైటాన్స్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2022లో అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్​కు హార్దిక్​ కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు ఈ టీమ్​ను తమ ఫస్ట్​ సీజన్‌లోనే ఛాంపియన్‌గా అవతరించేలా చేశాడు. అయితే గుజరాత్​ కన్నా ముందు ముంబయి ఇండియన్స్​లో కీలకంగా ఉన్న పార్దిక్​.. కెప్టెన్సీ ఆఫర్​ రావడంతో గుజరాత్​కు షిఫ్ట్ అయిపోయాడు. అలాగే కోల్​కతా నైట్​ రైడర్స్​లో మంచి ప్రదర్శన చేస్తున్న శుభమన్​ గిల్​ కూడా గుజరాత్​కు మారిపోయాడు. వీరిద్దరితో పాటు సన్​రైజర్స్​ ప్లేయర్​ రషీద్​ ఖాన్​ కూడా ఇదే జట్టుకు వెళ్లిపోయాడు. అలా ఈ ముగ్గురు ప్లేయర్స్​ మంచిగా రాణించడంతో ఐపీఎల్​ 2022 ఛాంపియన్​గా నిలిచింది గుజరాత్ జట్టు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2023లోనూ డిఫెండింగ్‌ ఛాంపియన్​గా బరిలోకి దిగుతున్న ఈ టీమ్​.. ఈ సారి కూడా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు టీమ్​ఇండియాలోనూ కెప్టెన్​ రోహిత్ వారసుడిగా హార్దిక్​ పేరునే చెప్పుకుంటున్నారు.

అయితే ఇప్పుడు.. త్వరలోనే హార్దిక్​కు గుజరాత్ షాకివ్వబోతుందా? కెప్టెన్​గా శుభ్‌మన్ గిల్​ను నియమించనుందా? అంటే.. భవిష్యత్​లో ఇదే జరగొచ్చని మాటలు వినిపించాయి. ఈ వ్యాఖ్యలు అన్నది మరెవరో కాదు గుజరాత్​ టైటాన్స్​ టీమ్​ డైరెక్టర్​ విక్రమ్​ సోలంకి. ఆయన తాజా వ్యాఖ్యలు.. గుజరాత్​ కెప్టెన్సీ మార్పు చర్చకు దారీ తీసింది. ఆయన మాట్లాడుతూ.. "గిల్​లో నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయి. అతడు టాలెంట్​ ప్లేయర్​ సమీప భవిష్యత్​లో అతడు మా కెప్టెన్​గా ఎదుగుతాడు. టీమ్ మీటింగ్స్​లో అతడిని ఆహ్వానించడంతో పాటు అతడి అభిప్రాయాలకు విలువిస్తున్నాం. కానీ అతడిని కెప్టెన్​ చేసే విషయమై మేం ఏం నిర్ణయం తీసుకోలేదు" అని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారింది. కానీ నిజానికి సోలంకి.. హార్దిక్​ను కెప్టెన్సీ నుంచి తొలిగిస్తామని చెప్పలేదు. భవిష్యత్​లో అతడు సారథి అయ్యే లక్షణాలు ఉన్నాయని అన్నారు.

కాగా, గత సీజన్​లో ఓపెనర్​గా బరిలోకి దిగిన శుభమన్​ గిల్.. 16 మ్యాచులలో 432 పరుగులు చేశాడు. రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో అర్ధ సెంచరీ బాదాడు. గతేడాది నుంచి నిలకడగా ఆడుతూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్​లలో మంచి ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్​పై ద్విశతకం, శతకం బాదాడు. అలాగే ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకున్న అతడు.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ వన్డే సిరీస్​లో మాత్రం రాణించలేకపోయాడు.

ఇదీ చూడండి:WPL 2023: ముగిసిన లీగ్​ మ్యాచ్​లు.. బ్యాట్​/బాల్​తో అదరగొట్టిన అమ్మాయిలు వీళ్లే!

ABOUT THE AUTHOR

...view details