తెలంగాణ

telangana

ETV Bharat / sports

Shubman Gill 2023 Stats : గిల్ అన్​స్టాపబుల్.. యంగ్​స్టర్ దెబ్బకు రికార్డులు దాసోహం - శుభ్​మన్ గిల్ 2023 వన్డే ర్యాంకింగ్

Shubman Gill 2023 Stats : భారత్ యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ ఈ ఏడాది అసాధారణ రీతిలో చెలరేగుతున్నాడు. 2023లో ఇప్పటికి ఏడు సెంచరీలు నమోదు చేసిన గిల్.. ఎన్నో రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు.

Shubman Gill 2023 Stats
Shubman Gill 2023 Stats

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 8:41 PM IST

Shubman Gill 2023 Stats :టీమ్ఇండియా యువ సంచలనం శుభ్​మన్ గిల్.. కెరీర్​లో అత్యుత్తమ ఫామ్​తో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాపై గిల్ సాధించిన శతకంతో కలిపి ఈ ఏడాది అతడు.. 7 సార్లు వందకు పైగా పరుగులు చేశాడు. అందులో వన్డేల్లోనే 5 సెంచరీలు సాధించాడు. ఇక మొత్తంగా 1763 పరుగులు బాదగా.. అందులో 1230 వన్డేల్లోనే చేశాడు. ఈ క్రమంలో అతడు అందుకున్న ఘనతలేంటో తెలుసుకుందాం.

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో తొలి 6 సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు..

  • శుభ్​మన్ గిల్ - 35 ఇన్నింగ్స్​
  • శిఖర్ ధావన్ - 46 ఇన్నింగ్స్​
  • కేఎల్ రాహుల్ - 53 ఇన్నింగ్స్​
  • విరాట్ కోహ్లీ - 61 ఇన్నింగ్స్​
  • గౌతమ్ గంభీర్ - 68 ఇన్నింగ్స్​.

క్యాలెండర్ ఇయర్ (ఒకే సంవత్సరం) వన్డేల్లో 5 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు..

  • విరాట్ కోహ్లీ - నాలుగు సార్లు (2012, 2017, 2018, 2019)
  • రోహిత్ శర్మ - మూడు సార్లు (2017, 2018, 2019)
  • సచిన్ తెందూల్కర్ - రెండు సార్లు (1996, 1998)
  • రాహుల్ ద్రవిడ్ - (1999)
  • సౌరభ్ గంగూలీ - (2000)
  • శిఖర్ ధావన్ - (2013)
  • శుభ్​మన్ గిల్ - (2023)

ఆసియా కప్​..ఇటీవల ముగిసిన 2023 ఆసియా కప్​ టోర్నమెంట్​లో కూడా గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మినీ టోర్నీలో 6 మ్యాచ్​లు ఆడిన గిల్​.. 302 పరుగులు చేశాడు. దీంతో టోర్నమెంట్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్​లో నిలిచాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Shubman Gill ODi Stats :ఇప్పటివరకు వన్డేల్లో 35 మ్యాచ్​లు ఆడిన గిల్.. 66.10 సగటున, 102.84 స్ట్రైక్ రేట్​తో 1917 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్ధ శతకాలు ఉండగా.. ఆరు శతకాలు బాదాడు. ఇక ఇదే ఏడాది న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​లో 149 బంతుల్లో 208 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో మేటి బ్యాటర్లను సైతం వెనక్కి నెట్టి 814 రేటింగ్స్​తో గిల్.. రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్​లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్.. 857 రేటింగ్స్​లో టాప్​లో ఉన్నాడు. అయితే ఆసీస్​తో బుధవారం జరిగే మూడో మ్యాచ్​లో గిల్​.. మంచి ఇన్నింగ్స్​తో రాణిస్తే.. అగ్రస్థానం దక్కించుకునే అవకాశం ఉంది. ఇలా ప్రపంచకప్​ సమీపిస్తున్నతరుణంలో గిల్.. అద్భుతమైన ఫామ్​లో ఉండడం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశమే.

Gill World Record : శుభ్​మన్‌ గిల్‌ నయా చరిత్ర.. పాక్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు బ్రేక్​.. ఏకంగా..

Shubman Gill Opening : మా జోడీయే ప్రపంచకప్​లో భారత్​కు కీలకం.. ఓపెనింగ్ చేసేటప్పుడు అందరి దృష్టి అతడిపైనే : గిల్

ABOUT THE AUTHOR

...view details