బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీనికి కారణం జట్టు సమష్టి కృషితో పాటు ఆ ఒక్క యువ ప్లేయర్ సెంచరీ. అతనే శుభ్‌మన్ గిల్. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు గెలుపొందుతారు అని ఉత్కంఠతో చూస్తున్న అభిమానులకు ఊరట కలిగించేలా మైదానంలోకి దిగిన ఈ ప్లేయర్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. అలా అహ్మదబాద్ వేదికగా సెంచరీ కొట్టిన గిల్(126 నాటౌట్) పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదివరకు ఆసియా కప్‌లో 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి తన తొలి శతకాన్ని నమోదు చేసిన గిల్.. అంతవరకున్న కొహ్లీ రికార్డులను బ్రేక్ చేసి మరిన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు.
కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన గిల్.. అంత చిన్న వయసులోనే నయా చరిత్ర!
వన్డేల్లో విజృంభించినట్లే టీ20ల్లోనూ దూసుకెళ్లాడు యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్. మైదానంలోకి దిగిన కాసేపటికే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ స్టార్ ప్లేయర్ కేవలం 54 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. అలా టీమ్‌కు రాకీ భాయ్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో అర్థ శతకాన్ని పూర్తి చేసేందుకు 35 బంతులు ఆడిన గిల్.. మరో 19 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా, ఈ అరుదైన రికార్డు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రలో నిలిచాడు. అతనికి ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు.
టీ20ల్లో సెంచరీలు చేసిన యువ క్రికటర్‌గా కూడా గిల్ పేరు రికార్డుకెక్కింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలు, టీ20ల్లో అత్యధిక స్కోర్ (208, 126 నాటౌట్) చేసిన ఆటగాడిగానూ గిల్ నిలిచాడు. అంతే కాకుండా టీమ్ ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా గిల్ రికార్డుకెక్కాడు. అంతకముందున్న రికార్డు విరాట్ కోహ్లి (122 నాటౌట్) పేరు మీద ఉండేది.