సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో ముంబయి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా విదర్భతో జరిగిన సెమీఫైనల్లో శ్రేయస్ అయ్యర్ (73; 44 బంతుల్లో 7×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 5 వికెట్ల తేడాతో ముంబయి విజయం సాధించింది.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఛేదనలో 31/2తో తడబడింది. ఈ స్థితిలో మొదట పృథ్వీ షా (34; 21 బంతుల్లో 2×4, 3×6) ఆ తర్వాత సర్ఫ్‌రాజ్‌ఖాన్ (27)తో కలిసి శ్రేయస్ జట్టును విజయానికి చేరువ చేశాడు. కానీ ఈ ముగ్గురు వెనదిరిగినా.. శివమ్ దూబె (13 నాటౌట్), ములానీ (1 నాటౌట్) పని పూర్తి చేశారు. ముంబయి 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు విధర్భ.. తొలి ఇన్నింగ్స్ ఆడిన విదర్భ 164/7 స్కోరు చేసింది. 28 పరుగులకే 2 వికెట్లు పడినా.. అపూర్వ్ (34), అథర్వ (29) జట్టును ఆదుకున్నారు. వీరితో పాటు ఆఖర్లో జితేశ్ శర్మ (46 నాటౌట్; 24 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా ఆడడంతో విదర్భ పోరాడే స్కోరు చేసింది. ఇక ఈ విజయంతో ముంబయి ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది.