Team india covid: వెస్టిండీస్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియాలో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. వీరిలో నలుగురు ప్లేయర్లు ఉన్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనికి పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొంది. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సహా మరో ఇద్దరు సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 6న జరగబోయే తొలి వన్డే.. భారత క్రికెట్లో ఎంతో ప్రత్యేకమైనది. అది టీమ్ఇండియా ఆడబోయే 1000వ వన్డే మ్యాచ్. దీంతో ఆ ఘనత సాధించే తొలి జట్టుగా నిలవనుంది భారత్.
వెస్టిండీస్‌తో టీమ్ఇండియా ఆడబోయే వన్డేలు ఫిబ్రవరి 6, 9, 11న అహ్మదాబాద్‌లో.. టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలో జరుగుతాయి.