Shreyas Iyer Practice : గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్వరలో ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా తరఫున ఆడనున్నాడు. ఇటీవలే విశ్రాంతి తీసుకుని ఫిట్నెస్ సంపాదించుకుని జట్టులోకి వచ్చినప్పటికీ అతడి ఆటతీరుపై అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి. అయితే ఇటీవలే ఆడిన ఓ గేమ్‌తో వాటన్నంటికీ చెక్ పెట్టాడు శ్రేయస్. బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీ వేదికగా జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో 199 స్కోర్ చేసి సత్తా చాటాడు. దీంతో సెలక్టర్లు అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకుంటున్న ఫ్యాన్స్ అతడి కమ్‌బ్యాక్‌కు నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే తీరులో రానున్న ఆసియా కప్‌లో శ్రేయస్ ఆడాలని ఆశిస్తున్నారు.
Shreyas Iyer Injury Update : దీంతో ప్రస్తుతం శ్రేయస్ ఫామ్‌లోకి వచ్చాడన్న విషయం ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌తో తేలిపోయింది. అయితే ప్రస్తుతం అందరి ఆందోళన మొత్తం అతడి గాయం గురించే. అతడు పూర్తిగా కోలుకుని ఉంటే మాత్రం టీమ్ఇండియా మిడిలార్డర్ కష్టాలు చాలా వరకు తీరినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అయ్యర్‌కు తగిలిన గాయం ఇంచు మించు బుమ్రా గాయం లాంటిదే. ఇక ఆ గాయం నుంచి కోలుకోవడానికి బుమ్రాకు సుమారు ఏడాది కాలం పట్టిందట. దీంతో శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ..అతను గాయం త్వరగా మానిపోవాలని కోరుకుంటున్నారు.