Shreyas Iyer Fitness : ఆస్ట్రేలియాతో కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతున్న తరుణంలో టీమ్ ఇండియాకు ఓ భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని కీలక సభ్యుడైన శ్రేయస్ అయ్యర్‌కు.. మరోసారి వెన్ను నొప్పి సమస్య తలెత్తింది. ప్రస్తుతం అతను దీని కోసం చికిత్స తీసుకునేందుకు వెళ్లాడు. ఫలితంగా అతడు.. మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అయ్యర్ ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది.
శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ ఫిట్నెస్ సమస్య.. మ్యాచ్‌కు దూరం! అసలేమైంది?
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమ్ ఇండియాకు ఓ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పితో బాధపడుతున్న క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.
గత కొంత కాలంగా అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు శ్రేయస్. మూడో టెస్టు సమయంలోనే తన పరిస్థితి గురించి శ్రేయస్ సపోర్ట్ స్టాఫ్‌కు చెప్పాడు. దీంతో అతడిని తదుపరి చికిత్స కోసం స్కానింగ్‌కు పంపించింది బీసీసీఐ మెడికల్ టీమ్. అయితే సాధారణంగా శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. కానీ తన పరిస్థితి కారణంగా అతని స్థానంలో మరో ప్లేయర్ రవీంద్ర జడేజా మైదానంలోకి వచ్చాడు. జడేజా తర్వాతనైనా శ్రేయస్ వస్తాడనుకుంటే ఆ స్థానంలో శ్రీకర్ భరత్ ప్రత్యక్షమయ్యాడు. మైదానంలోకి శ్రేయస్ రాకపోవడం వల్ల ఫ్యాన్స్ అతని ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తాజా అప్డేట్ ఇచ్చింది. అయితే శ్రేయస్ ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గాయాల కారణంగా గతంలోనూ పలు మ్యాచ్‌లకు శ్రేయస్ దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్, నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టులో కూడా ఆడలేకపోయాడు. అప్పుడు అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించింది టీమ్ ఇండియా. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, దిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 బంతులకు 4 పరుగులు చేసి ఔట్ అయిన శ్రేయస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో 10 బంతులకు గాను ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు శ్రేయస్. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 26 పరుగులు చేశాడు.