Shreyas Iyer Century: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా(IND vs NZ 1st test) జట్టులో అవకాశం దక్కించుకున్నాడు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. తొలి టెస్టులోనే శతకం నమోదు చేసిన 16వ భారత ఆటగాడిగా నిలిచాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేశాడు.
టిమ్ సౌథీ వేసిన 92వ ఓవర్లో రెండు పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు శ్రేయస్. 2018లో వెస్టిండీస్ టెస్టుతో ఆరంగేట్రం చేసిన పృథ్వీ షా తొలి టెస్టులోనే 134 పరుగులు చేసి.. సెంచరీ చేసిన 15వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాపై 187 పరుగులు చేసిన శిఖర్ ధావన్.. అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇండియా బ్యాటర్‌గా నిలిచాడు.
గతంలో గంగూలీ, సెహ్వాగ్, సురేశ్ రైనా కూడా తొలి టెస్టులోనే సెంచరీ బాదిన జాబితాలో ఉన్నారు.