Shreyas Iyer Record in Test Debut: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొట్టాడు టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ (105) చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడిలోనూ రాణిస్తూ హాఫ్ సెంచరీ (65) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు శ్రేయస్. అరంగేట్ర టెస్టులోనే శతకం, అర్ధ శతకం బాదిన తొలి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.
అలాగే అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్లో 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్గా నిలిచాడు శ్రేయస్. ఇంతకుముందు సునీల్ గావస్కర్ (1971లో), దిలావర్ హుస్సేన్ (1934లో) ఈ ఘనత సాధించారు.
చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారత ఆటగాడిగా! - శ్రేయస్ అయ్యర్ న్యూస్
Shreyas Iyer Record in Test Debut: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకంతో మెరిసిన టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
శ్రేయస్ అయ్యర్
ఇదీ చదవండి: