IPL Auction 2022: ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. బెంగళూరులో శనివారం, ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త ప్రాంఛైజీలు గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్జియంట్స్తో కలిపి ఈసారి మొత్తం 10 జట్లు వేలంపాటలో పాల్గొంటున్నాయి. 227 విదేశీ ఆటగాళ్లు సహా మొత్తం 590 మంది ప్లేయర్లు అందుబాటులో ఉంటున్నారు. తాము కావాలనుకునే ప్లేయర్‌ను దక్కించుకునేందుకు ఎన్ని రూ.కోట్లయినా వెచ్చించేందుకు ప్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి వేలంలో ఏ ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తుంది? ఎవరి కోసం ప్రాంఛైజీలు పోటాపోటీగా పాట పాడుతాయి? విదేశీ ఆటగాళ్లలో ఎవరికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు ఓసారి చూద్దాం.
IPL 2022
అయ్యర్, ఠాకూర్లకు కాసుల పంట!
టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్లపై ఈ మెగా వేలంలో కనకవర్షం కురిసే అవకాశాలున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే వీరు రికార్డు ధర పలికే ఛాన్స్ పుష్కలంగా ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంచి కెప్టెన్ కావాలనుకునే ప్రాంఛైజీలు రూ.20 కోట్లు వెచ్చించైనా శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకుంటాయని చెబుతున్నారు. శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(కీపర్-బ్యాటర్) రూ.12-15కోట్లు పలకవచ్చని పేర్కొన్నారు. 10 మందికిపైగా భారత ఆటగాళ్లు రూ.10-20కోట్ల మధ్య కొల్లగొట్టవచ్చన్నారు.
దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ కోసం కూడా ప్రాంఛైజీలు పోటీ పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ఇద్దరు బౌలర్లు రూ.15 కోట్ల వరకు దక్కించుకోవచ్చు.
దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని(సీఎస్కే), విరాట్ కోహ్లీ(ఆర్సీబీ), రోహిత్ శర్మ(ముంబై)లను ఆయా ప్రాంఛైజీలు రిటైన్ చేసుకున్నాయి. దీంతో నిఖార్సయిన మిడిల్ ఆర్డర్స్ బ్యాటర్లు, మణికట్టు స్పిన్నర్లపై ఇవి దృష్టి సారిస్తాయి. అలాగే ఫుల్ డిమాండ్‌లో ఉండే ఆల్‌రౌండర్ల కోసమూ పాట పాడనున్నాయి.
గతేడాది రిటెన్షన్‌లో రూ.17కోట్ల అత్యధిక ధర పలికిన కేఎల్ రాహుల్, దిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ప్రాంఛైజీలకే బలమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, గేమ్ ఛేంజర్స్ అవసరం ఎక్కువగా ఉంది. మయాంక్ అగర్వాల్, కేన్ విలియమ్సన్ వంటి ఆటగాళ్లు అంచనాలను అందుకోకపోయినా ప్రత్యామ్నాయ ఆటగాడు ఉండాలని ఆయా ప్రాంఛైజీలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం పంజాబ్ పర్సులో రూ.72కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ.68కోట్లు, రాజస్థాన్ రాయల్స్ పర్సులో రూ.62కోట్లు ఉన్నాయి. దీంతో తమకు కావాల్సిన ఆటగాడి కోసం ఎన్ని రూ.కోట్లయినా వెచ్చించే అవకాశం ఉంది.
IPL 2022 Players
వారిపైనే దృష్టి..
ధోని సారథ్యంలోని సీఎస్కే.. మ్యాచ్ విన్నర్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించనుంది. పంజాబ్, రాజస్థాన్ ప్రాంఛైజీలు మాత్రం ఎప్పటిలాగే తాము కావాలనుకున్న ప్లేయర్ల కోసం రూ.కోట్లు గుమ్మరించనున్నాయి. కొత్త కెప్టెన్ కోసం చూస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ కోసం ఇతర ప్రాంఛైజీలతో పోటాపోటీగా వేలంపాట పాడే అవకాశం ఉంది. అయితే వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకున్న ఈ ప్రాంఛైజీ పర్సులో రూ.48కోట్లే మిగిలి ఉండటం, ఎక్కువమంది ఆటగాళ్లు కావాల్సి ఉండటం ప్రతికూలాంశంగా మారనుంది.
ప్రతిజట్టులో కనీసం 18 మంది ఆటగాళ్లు ఉండాల్సిన ఈ వేలం పాటులో ఒక్కో ప్రాంఛైజీ 22-25మంది ప్లేయర్లను తీసుకుంటుంది. అందుకే క్యాప్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈకారణంగానే గతేడాది ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ కనీస ధరను రూ.2కోట్లుగా నిర్ణయించారు. ఇంతకు ఐదు రెట్లు ఎక్కువ అతని దక్కే అవకాశాలున్నాయి. అలాగే స్పీడ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ బేస్ ప్రైజ్ రూ.20లక్షలుగా ఉండగా.. అతను రూ.10కోట్ల వరకు పలకవచ్చు. అంటే బేస్ ప్రైజ్ కన్నా 50 రేట్లు ఎక్కువ.
సీనియర్లకూ రూ.కోట్లు..